Budh Gochar 2022: బుద్ధి, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు బుధుడు కారకుడు. డిసెంబరు మెుదటి వారంలో అంటే 3వ తేదీన బుధుడు ధనుస్సు రాశిలోకి (Mercury transit in Sagittarius 2022) ప్రవేశించనున్నాడు. మెర్య్కూరీ యెుక్క ఈ సంచారం కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది. ధనుస్సు రాశిలో బుధుడి సంచారం వల్ల ఏయే రాశులకు శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini); బుధుడిని మిథున రాశికి అధిపతిగా భావిస్తారు. మెర్క్యూరీ యెుక్క ఈ సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. భాగస్వామ్యంతో బిజినెస్ చేసే వారు భారీగా లాభపడతారు. ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మెుత్తానికి ఈ టైంలో మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. 
సింహం (Leo): ధనుస్సు రాశిలో మెర్క్యురీ సంచారం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు షేర్ మార్కెట్ లేదా ఏదైనా లాటరీ లేదా బెట్టింగ్ నుండి ప్రత్యేక లాభం పొందవచ్చు. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడుతుంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్కాలర్‌షిప్ లభిస్తుంది. ప్రేమలో విజయం సాధిస్తారు. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. 
కన్యా రాశి (Virgo): ఈ బుధ సంచారం కన్య రాశివారిలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంచారం మీకు వాహనం, ఆస్తి పరంగా శుభ ఫలితాలను ఇస్తుంది. పెట్టుబడి పెట్టాలన్నా, ఆస్తి కొనుగోలు చేయాలన్నా ఇదే మంచి సమయం. ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్‌తో అనుబంధం ఉన్న వారికి ఈ సమయం బాగుంటుంది. 


ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారు బుధ సంచార శుభ ప్రభావం వల్ల వృత్తి జీవితంలో అనేక అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. దిగుమతి-ఎగుమతి, వైద్య రంగంతో అనుబంధం ఉన్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం అద్భుతంగా ఉంటుంది. మీరు పెద్ద ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది.
కుంభం(Aquarius): కుంభ రాశి వారికి ఈ సమయం ఆదాయం మరియు లాభాల పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో ఈరాశివారు ఖర్చులతోపాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా మంచిది. వ్యాపారులు, ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Astrology: అనురాధ నక్షత్రంలో మూడు గ్రహాలు... ఈ రాశులకు ఆర్థికంగా లాభం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.