Mercury Transit 2023 In Virgo: అష్ట గ్రహాల్లో బుధుడు కూడా ఒకరు. ఇతడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఇతడిని తెలివితేటలు, సంపద మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. ఇతడి గమనంలోని మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబరు 01న బుధుడు కన్యారాశిలోకి(Mercury Transit In Virgo 2023) ప్రవేశించబోతున్నాడు. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యా రాశి: ఇదే రాశిలో బుధుడి సంచారం జరగబోతుంది. దీంతో వీరిపై బుధుడి అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారి సంపద రెట్టింపు అవుతుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యక్తిత్వంతో ప్రజలను ఆకట్టుకుంటారు. 
వృషభం: బుధ సంచారం వృషభ రాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. 
మకరం: కన్యారాశిలో బుధుడి సంచారం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ఫారిన్ వెళ్లాలనే వారి కోరిక నెరవేరుతుంది. మీరు ఈ సమయంలో దైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also Read: Rajyog benefits 2023: త్రికోణ రాజయోగంతో మారనున్న ఈ రాశుల ఫేట్.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి