Mercury Transit 2022: మన సౌరకుటుంబంలోని నవగ్రహాలన్నీ ఎప్పటికప్పుడు తమ రాశులను మార్చుతూనే ఉంటాయి. ఈ రాశుల మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ మార్పు కారణంగా కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశించవచ్చు, మరికొన్ని రాశులవారికి చెడురోజులు దాపురించవచ్చు. బుధ గ్రహం మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 21న తన రాశిని మార్చబోతుంది. దీని సంచారం (Mercury Transit in Virgo 2022) మూడు రాశులవారికి కష్టాలను కలిగించవచ్చు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూడు రాశులకు చెడు రోజులు


కుంభం (Aquarius): బుధ గ్రహం రాశి మార్పు కారణంగా ఈ రాశివారి ఆరోగ్యం క్షీణించడం లేదా ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. వీలైతే బుధవారం ఆహారం తినడం మానేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. గొడవలు జోలికి పోకండి. 


తుల (Libra): బుధ సంచార సమయంలో తుల రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వారి ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి. దుబారా భారీగా చేస్తారు. కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో చిక్కుకోవాల్సి రావచ్చు. 


మేషం (Aries): బుధ గ్రహం రాశి మార్పు మేషరాశిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు మీ పిల్లల చదువుల గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది. మీ పిల్లలు చెడు సాంగత్యంలో పడే అవకాశం ఉంది. వీలైతే ఈ సమయంలో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ..వారిని చదువుకునేలా ప్రేరేపించండి.


ఆగస్టు 21న అరుదైన యోగం
బుధ గ్రహం ఆగస్టు 21న తెల్లవారుజామున 1:55 గంటలకు తన సొంత రాశి అయిన కన్య లోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో గురు గ్రహం నుండి సప్తమ స్థానంలో బుధ గ్రహం ఉండటం వల్ల... బృహస్పతి మరియు బుధ గ్రహాల మధ్య 'సంసప్తక యోగం' కూడా ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం వల్ల విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరి వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 


Also Read: Sun Transit 2022: సూర్యుడి సింహరాశి ప్రవేశం... ఈ రాశులకు అపారమైన ప్రయోజనం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook