Mercury Venus Conjunction 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను 'యుతి' అంటారు. జూలై 13న శుక్ర గ్రహం మిథునరాశిలోకి  ప్రవేశించింది. ఇప్పటికే ఆ రాశిలో బుధుడు కూర్చుని ఉన్నాడు.  ఈ రెండు రాశుల కలయిక (Mercury-Venus Conjunction In Gemini 2022) వల్ల మిథునరాశిలో మహారాజ యోగం ఏర్పడుతోంది.  దీని ప్రభావం మొత్తం 12 రాశుల మీద కనిపించినప్పటికీ.... 3 రాశుల వారికి మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల జాతకంలో ద్వంద్వ రాజయోగం ఏర్పడుతోంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini) - ఈ రాశిలోనే మహారాజ యోగం ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశి వారికి చాలా మేలు జరగబోతుంది. ఈ రాశులవారి జాతకంలో 2 రాజయోగాలు కూడా ఏర్పడతున్నాయి.  సొంత రాశిలో బుధుడు ఉండటం వల్ల భద్ర అనే రాజయోగం.. అదే సమయంలో శుక్ర గ్రహంతో ఉండడం వల్ల కేంద్ర త్రిభుజమనే రాజయోగం కూడా ఏర్పడుతోంది. ఈ ద్వంద్వ రాజయోగం వల్ల భౌతిక సుఖాలు లభిస్తాయి. అదే సమయంలో దశమ స్థానంలో గురువు ఉండటం వల్ల హన్స్ అనే రాజయోగం ఏర్పడుతోంది. ఈ కాలంలో వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ రావచ్చు. 


కన్య (Virgo) - ఈ రాశివారికి కూడా ఈ మహా రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆఫీసులో గౌరవం లభిస్తుంది. కొత్త జాబ్ రావచ్చు. ఈ సమయంలో ఒపల్ లేదా డైమండ్ ధరించడం అదృష్టంగా భావిస్తారు. 


మకరం (Capricron)- ఈ రాశి వారి సంచార జాతకంలో రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో రుచక్, షష్ అనే రాజయోగం కూడా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఏదైనా పని మెుదలుపెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం.  కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. 


Also Read: Sravana Masam 2022: శ్రావణంలో ఈ 5 మొక్కలు నాటితే.. అదృష్టానికి తిరుగుండదు, డబ్బుకు లోటు ఉండదు!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook