Mercury Transit 2023: మార్చి 31న బుధుడు మేషరాశి ప్రవేశం... ఈ రాశులకు తెరుచుకోనున్న అదృష్టం..
Budh Gochar 2023: ఫ్లానెట్స్ ప్రిన్స్ అయిన బుధుడు ఈ నెల చివరిలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులేంటో ఓ లుక్కేద్దాం.
Mercury Transit 2023: గ్రహాల యువరాజైన బుధుడు మార్చి 31 మేషరాశిలో సంచరించున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో కదులుతున్నాడు మెర్క్యూరీ. జ్ఞానం మరియు వ్యాపారానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. ఇతడి మేషరాశి ప్రవేశం వల్ల మూడు రాశులవారి అదృష్టం తెరుచుకోనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
బుధుడు సంచారం ఈ రాశులకు అనుకూలం
మేషం - ఈ రాశి వారికి బుధుని సంచారం లగ్నంలో జరుగుతుంది. దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ప్రజలను మెప్పిస్తారు. మీడియా మరియు బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే అనుకూల సమయం. మీకు ఫ్యామిలీ, ప్రెండ్స్ సపోర్టు లభిస్తుంది.
కర్కాటకం - ఈ రాశి యెుక్క పదవ ఇంటి గుండా బుధుడు ప్రయాణిస్తున్నాడు. ఇది కార్యనిర్వాహక గృహం. ఈ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం - ఈ రాశి యెుక్క మూడవ ఇంటి గుండా మెర్క్యూరీ వెళ్తున్నాడు. ఇది శక్తి యొక్క ఇల్లు. ఈ ఇంట్లో బుధుడు కూర్చోవడం వల్ల మీడియా మరియు రచనలతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.
Also Read: Shani-Rahu Yog: శని-రాహు అశుభ కలయిక.. రాబోయే 7 నెలలుపాటు ఈ 3 రాశులకు ఇబ్బందులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook