Mercury Planet: బుధుడి రాశిలో మార్పు... న్యూ ఇయర్ లో ఈ రాశులవారిపై డబ్బు వర్షం..
Budh Planet Gochar 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం మకరరాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో ఈ ఏడాది చివరిలో మూడు రాశులవారు అదృష్టం ప్రకాశించనుంది.
Budh Planet Gochar In Capricorn: వైదిక క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్ 28న బుధ గ్రహం మకరరాశిలో సంచరించబోతోంది. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. బుధుడి కదలికలో మార్పు వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగాల్లో విజయాన్నిస్తుంది. మెర్క్కూరీ సంచారం (Budh Gochar 2022) కొత్త ఏడాదిలో మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. వీరికి ఊహించనంత ధనం, బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభ రాశి (Taurus): మెర్క్యురీ యొక్క సంచారము మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధగ్రహం మీ అదృష్ట గృహంలో సంచరిస్తుంది. అందుకే ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. హోటల్ లేదా ఆహారం, బట్టలు మరియు ఇంటీరియర్‌కు సంబంధించిన బిజినెస్ చేసేవారు లాభపడతారు.
కర్కాటక రాశిచక్రం (Cancer): బుధ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి ఏడవ ఇంటిలో సంచరించబోతోంది. దీంతో మీ తోబుట్టువుల మద్దతు మీకు లభిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం బాగుంటుంది. మీ కెరీర్ పురోగతికి అపారమైన అవకాశాలున్నాయి. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మీరు ఫ్యామిలీ లేదా మిత్రులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
తులా రాశిచక్రం (Libra): తుల రాశి వారికి మెర్క్యురీ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీ జీవితంలో ఆనందం నెలకొంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలున్నాయి. మీరు షేర్లు, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాన్ని పొందుతారు. మీరు పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలను పొందుతారు.
Also Read: Laxmi Narayan Rajyog: 2022 ముగింపు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.