హిందూమతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవ దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే మహా శివుడి కటాక్షం లభిస్తుందంటారు. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. కేవలం ఓ చెంబు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి చాలంటారు జ్యోతిష్య పండితులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం వ్రత ఉపవాసంతో పాటు కొన్ని పద్దతులు పాటిస్తే శివుడు ప్రసన్నమై అన్ని కష్టాలు దూరమౌతాయి. దాంతోపాటు ఇళ్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేక పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై భక్తుల అన్ని కోర్కెలు నెరవేరుతాయి. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో తెలుసుకుందాం.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యముంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుడి పూజతో జరిగితే..వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తరువాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనం బొట్టు పెట్టాలి.


శివుడి పూజా సమయంలో శివ చాలీసా, శివాష్టకం పఠించాలి. దీనివల్ల భక్తుల కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమౌతాయి. అన్ని కోర్కెలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవల్సి వస్తున్నా..సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరుడికి రుద్రాక్ష సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమౌతాయి. ధనవర్షం కురుస్తుంది. 


శివుడిని పూజించేటప్పుడు బేళపత్రంపై తెల్లటి చందనం రాసి అర్పించాలి. మనస్సులోని కోర్కెలు పూర్తవుతాయి. దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమశ్శివాయ పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కన్పిస్తుంది. 


Also read: Vastu Tips: సమస్యలు ఎప్పటికీ తగ్గడం లేదా, కిచెన్ నుంచి వెంటనే ఈ వస్తువుల్ని తొలగించి చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook