Powerful Money Attraction Mantra: జీవితంలో గౌరవంతో పాటే డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే మనుషులు కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే జీవితం అన్నకా ఆర్థిక సమస్యలు రావడం సర్వసాధరణం.  ఈ సమస్యల నుంచి బయట పడడం చాలా సులభమేమి కాదు. డబ్బు సంపాదించాలనుకుంటే తప్పకుండా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అయితే కొంత మందిలో కష్టపడి పని చేసిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతారు. అంతేకాకుండా వారి దగ్గర కూడా డబ్బు నిల్వదు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా వాస్తు నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చెద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో డబ్బు నిల్వాలంటే ఇలా చేయండి:
1. లాఫింగ్ బుద్ధ:

వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధకు చాలా ప్రముఖ్యత ఉంది. ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంచడం చాలా శుభప్రదంగా కలిగే అవకాశాలున్నాయని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సానుకూల శక్తి కూడా ఇంట్లో ప్రవేశించే ఛాన్స్‌ కూడా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. అంతేకాకుండా దీనికి ప్రతి రోజూ కూడా పూజ కార్యక్రమాలు చేస్తారు.


2. తులసి మొక్క:
హిందూ పురాణాల్లో తులసి మొక్కకి చాలా ప్రధాన్యత ఉంది. తులసిలో సాక్ష్యాత్తు లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి కొత్త సంవత్సరం రోజున ఇంట్లో తులసి మొక్కలను నాటడం వల్ల సులభంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.


3. నెమలి ఈకలు:
నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంతో ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


4. లోహపుతాబేలు:
లోహపు తాబేలు కూడా వాస్తు శాస్త్రంలో శుభప్రదంగా భావిస్తారు. అయితే దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా లాభాలు కూడా పొందుతారు.


5. దక్షిణావర్తి శంఖం:
తెలిసిన వారు చాలా వరకు దక్షిణావర్తి శంఖాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ శంఖాన్ని ఎర్రటి గుడ్డలో పెట్టి ఇంట్లో పెట్టడం వల్ల  ఐశ్వర్యం లభిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్


Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook