Grah Gochar 2023: ఫిబ్రవరిలో మారబోతున్న నాలుగు పెద్ద గ్రహాలు.. ఈ రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!
These 5 Zodiac Signs will get huge money after Grah Rashi Parivartan 2023 in Februrary 2023. గ్రహాల సంచారం కారణంగా ఫిబ్రవరి నెలలో అనేక రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుస్తుంది.
Money Rain on These 5 Zodiac Signs due to Grah Gochar 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి గ్రాహం ఓ నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మార్చుతుంది. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి 7న మకర రాశిలోకి గ్రహాల యువరాజు బుధుడు ప్రవేశిస్తాడు. దీని కారణంగా 'బుధాదిత్య యోగం' ఏర్పడుతుంది. ఫిబ్రవరి 27న కుంభ రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. కుంభ రాశిలో సూర్యుడు మరియు శనితో పాటు బుధుడు ఉండడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.
2023 ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 15న శుక్రుడు తన ఉన్నతమైన మీన రాశిలో సంచరిస్తాడు. ఫిబ్రవరి 18న నెప్ట్యూన్ గ్రహం మీనంలో సంచరించనుంది. మీన రాశిలో శుక్రుడు మరియు గురువుతో నెప్ట్యూన్ కలవనున్నాడు. గ్రహాల సంచారం కారణంగా ఫిబ్రవరి నెలలో అనేక రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుస్తుంది. ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి:
మేష రాశి వారికి గ్రహాల రాశులు మారడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. గతంలో చిక్కుకుపోయిన డబ్బు రికవరీ అవుతుంది. అంతేకాకుండా పెట్టిన పెట్టుబడి కూడా లాభిస్తుంది. తల్లిదండ్రులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. వారి సహాయంతో ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. స్నేహితుల పూర్తి మద్దతు ఉంటుంది. ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లడానికి ప్రణాళిక వేయవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
కర్కాటక రాశి:
నాలుగు గ్రహాల రాశి మారడం వల్ల కర్కాటక రాశి వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. పూర్వీకుల ఆస్తిని పొందవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి కూడా బలంగా ఉంటుంది. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి. గౌరవం పెరుగుతుంది. ఈ సమయం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.
కన్యా రాశి:
నాలుగు గ్రహాల సంచారం కన్యా రాశి వారికి అదృష్టంగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం కూడా వెతకవచ్చు. చట్టపరమైన వివాదంలో విజయం సాధించవచ్చు. అసంపూర్తిగా ఉన్న పనులు సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఈ కాలం వ్యాపారులకు అనుకూలమైనది. కొత్త ఆర్డర్ అందుకోవచ్చు. డబ్బు వర్షం కురుస్తుంది.
తులా రాశి:
తులా రాశి వారికి గ్రహాల సంచారం చాలా మేలు చేస్తుంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది. సంబంధం కూడా బలంగా మారుతుంది. వ్యాపారంలో పురోభివృద్ధి, ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక స్థలాలకు వెళ్లవచ్చు. మీ పనులు ప్రశంసించబడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెల శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో సూర్యుడు, శుక్రుడు మరియు బుధ గ్రహాలు ఉంటాయి. ఇది జీవితంలో సానుకూలతను తెస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయవచ్చు. గ్రహాల ప్రభావం వల్ల శక్తితో నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు వర్షం కురుస్తుంది.
Also Read: U-19 Womens T20 World Cup 2023 Final: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.