December Horoscope: డిసెంబర్ నెలలో మారనున్న ఆ రాశి జాతకం, ఎలా ఉండనుంది
December Horoscope: జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు విశేష మహత్యముంది. వృషభరాశివారికి జాతకమే మారిపోనుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సూచనలు పాటించాలి.
నక్షత్రాలు, గ్రహాల్ని బట్టి రాశుల జాతకం మారుతుంటుంది. అందుకే వృషభరాశివారికి డిసెంబర్ నెలలో జాతకమే మారిపోనుంది. కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
వృషభరాశి జాతకులు డిసెంబర్ నెలలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే బంధాలతో పాటు కెరీర్లో కూడా సమస్యలు ఉత్పన్నమౌతాయి. జీవిత భాగస్వామితో మంచి సంబంధం కొనసాగించాలి. ప్రేమ సంబంధాలు పెళ్లికి దారితీయవచ్చు. ఈ రాశివారికి డిసెంబర్ నెలలో కెరీర్‌పరంగా కొన్ని కొత్త మార్పులు కన్పిస్తాయి. వ్యవహారశైలి సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి.
వ్యాపారులకు నెల ప్రారంభం బాగుంటుంది. వ్యాపారంలో కష్టపడితే ఫలితముంటుంది. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే వ్యాపారపరంగా నష్టాలెదురౌతాయి. కోపాన్ని నియంత్రించుకోకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా మారి..అదుపు తప్పుతాయి.
ఇంట్లో పెళ్లి వంటి శుభకార్యాలు
ప్రేమ సంబంధం నెమ్మది నెమ్మదిగా ప్రేమ వివాహాలకు దారి తీయవచ్చు. ఇప్పటివరకూ పెళ్లికాకపోతే..పెళ్లి జరుగుతుంది. ఇంట్లో పెళ్లిబాజాలు మోగుతాయి. యువకుల్లో ప్రేమ చిగురిస్తుంది. డిసెంబర్ నెలంతా యువతీ యువకులకు ప్రేమ వ్యవహాలు కచ్చితంగా ఉంటాయి. పెద్దలకు తెలియకుండా రహస్యంగా జాగ్రత్త పడటం వంటివి ఉంటాయి. ఇలా చేయకుండా పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పి..వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యం విషయంలో ఈ నెల మంచిది కాదు. డిసెంబర్ 16 తరువాత ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరిగిపోతాయి. అందుకే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న సమస్యలున్నా వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిది. నిర్లక్ష్యం చేయకూడదు.
పెట్టుబడులకు దూరం
కుటుంబ జీవితంల ఆర్ధిక సమస్యల్ని ఎదుర్కోవల్సివస్తుంది. డిసెంబర్ 16 తరువాత కుటుంబసభ్యులు పెరిగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం క్షీణిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబసభ్యులు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడకుండా నియంత్రించాలి. తండ్రితో సంబంధాలు బాగుండాలి. సోదర సోదరీమణుల మధ్య సమస్యలు వచ్చినా పరిష్కారమౌతాయి. సంతానం విషయంలో శుభవార్త వింటారు. పెట్టుబడులకు డిసెంబర్ నెలంతా దూరంగా ఉంటే మంచిది. లేకపోతే నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook