Moon Transit 2023: మేషంలో గురు, చంద్రుల కలయిక.. ఫలితంగా `గజకేసరి యోగం` ఈ రాశులకు కలిసి రానున్న కాలం
Gajkesari Yog In Aries 2023: ఇటీవల చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. దీంతో అదే రాశిలో మూన్ మరియు బృహస్పతి కలయిక ఏర్పడింది. దీని కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Moon and Jupiter Conjunction makes Gajkesari Yog In Aries 2023: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చనున్నాయి. జూన్ 13న చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. బృహస్పతి ఇప్పటికే మేషరాశిలో కూర్చుని ఉన్నాడు. గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
గజకేసరి రాజయోగం ఈ రాశులకు వరం
మేషరాశి
గజకేసరి రాజయోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుుంది. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది.
మిధునరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం మిధున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జాతకంలో 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు పాతపెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు.
Also Read: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ తెలివితేటలతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది.
Also Read: Surya Gochar 2023: జూన్ 15 నుండి ఈ రాశులకు మంచి రోజులు మెుదలు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook