Mysterious Lake: దేశ రాజధాని నగరం ఢిల్లీ సమీపంలో ఉన్న అద్భుతమైన, అందమైన పర్యాటక ప్రాంతమిది. ఢిల్లీలో అందమైన ప్రాంతాలతో పాటు రహస్యమైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటిదే ఈ సరస్సు. ఇదొక మిస్టరీ సరస్సు. ఈ సరస్సును చేరాలంటే సాహసమైన ప్రయాణం చేయాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలం నడుస్తోంది. చాలామంది మాన్‌సూన్ వెకేషన్ కోసం అందమైన డెస్టినేషన్లు ఎక్కడున్నాయా అని అణ్వేషిస్తుంటారు. అందంతో పాటు థ్రిల్లింగ్ కూడ కల్గించే ప్రాంతం ఢిల్లీ సమీపంలోనే ఉంది. ఇదొక మిస్టరీ సరస్సు. ఈ సరస్సు ఓ ప్రత్యేకత అయితే అక్కడికి చేరుకునే మార్గాలు కూడా చాలా థ్రిల్లింగ్ కలిగిస్తాయి. ఇది సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ నుంచి దాదాపుగా 147 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేచియోపాలరీ గ్రామం. ఈ గ్రామంలో ఓ మిస్టరీ సరస్సు ఉంది. కోర్కెలు నెరవేర్చుకునేందుకు అందరూ ఇక్కడికి వస్తుంటారు. ఈ సరస్సు ఓ పాదం ఆకారంలో ఉంటుంది. కొంతమంది శివుని ముద్రగా భావిస్తే మరి కొంతమంది బౌద్ధ గురువు  పాదముద్రగా పరిగణిస్తారు.


స్థానికుల విశ్వాసం, నమ్మకాల ప్రకారం కోరుకున్నవి పూర్తవాలంటే ఇక్కడికి వస్తే చాలంటున్నారు. ఇక్కడే దుపుకనీ అనే ఓ గుహ ఉంది. ఈ గుహలో శివుడు తపస్సు చేశాడని నమ్ముతారు. ఈ సరస్సు 5,577 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే 500 మీటర్ల వరకూ అడవి దాటుకుని రావాలి. అది కూడా సన్నని దారి నుంచి వెళ్లాలి. ఈ సన్నని దారి చివరిలో ఓ కర్ర వంతెన సరస్సు వరకూ ఉంటుంది. చెప్పులు విడిచి పెట్టి వెళ్లాలి. 


ఢిల్లీ నుంచి రైలు మార్గం లేదా విమానమార్గం ద్వారా గ్యాంగ్‌టక్ చేరుకోవాలి. కారులో కూడా వెళ్లవచ్చు. కాస్త సమయం ఎక్కువ పడుతుంది. గ్యాంగ్‌టక్ చేరుకున్న తరువాత ట్యాక్సీ ద్వారా 5 గంటల్లో ఈ ఊరికి చేరవచ్చు. కోరిన కోర్కెలు నెరవేర్చుకునేందుకు అందరూ ఇక్కడికి వెళ్తుంటారు. 


Also read: TTD Donation: కొన్నేళ్ల తర్వాత టీటీడీకి ఊహించనంత భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook