August Month Lucky Zodiac Sign 2023: జూలై నెల నుంచి మనమంతా ఆగస్టు నెలలోకి అడుగు అడుగు పెట్టబోతున్నాం. ఈ నెలలో ఎన్నో ముఖ్యమైన పండగలు రాబోతున్నాయి. ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం కూడా ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా సూర్య, శుక్ర, కుజ, బుధ గ్రహాలు కూడా రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. అయితే వీటన్నిటి ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యేకంగా పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఆగస్టు నెలలో ఎంతో ముఖ్యమైన శ్రావణమాసం కూడా ప్రారంభం కావడంతో కొన్ని రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశుల వారు ఈ నెలలో ఎక్కువగా లాభాలు పొందుతారో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధున రాశి:
ఆగస్టు నెలలో మిధున రాశి వారికి కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందబోతున్నారు. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. ఆగస్టు నెలలోని రెండో వారంలో విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తే భారీ లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసే వారు కూడా మంచి లాభాలు పొందబోతున్నారు. ఈ క్రమంలో కష్టపడి పనిచేయడం వల్ల ఆఫీసులో మంచి పేరు పొందడమే కాకుండా ప్రమోషన్ కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్థాన చలనం కారణంగా కూడా వీరు మంచి జీవితాలు పొందుతారు. మిధున రాశి వారికి తాత తండ్రుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా ఈ నెలలో పొందే అవకాశాలున్నాయి.


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఆగస్టు నెల కలిసి రాబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో ప్రణాళికలతో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అయితే వీరు ఈ నెలలో చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు  గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి బాస్ ప్రోత్సాహం లభించి రెట్టింపు ఉత్సాహంతో పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయిన వారికి ఈ క్రమంలో సులభంగా ఉపమనం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా క్రీడాకారులకు ఈనెల ఎంతో సరైన సమయంగా చెప్పవచ్చు. ఇష్టపడి ఆటల్లో ఆడడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. 


సింహరాశి:
ఆగస్టు నెలలో సింహ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నెలలో అనుకున్న పనులు జరగడమే కాకుండా అదృష్టం రెట్టింపు అవ్వబోతోంది. ఇక వృత్తి పూలతో జీవితాన్ని గడుపుతున్న వారికి మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు సుదూర ప్రయాణాలు చేయడం వల్ల ఊహించని లాభాలు పొందబోతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో సింహ రాశి వారికి కొత్త వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు. ఈ నెలలో సింహ రాశి వారు వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్నేహితుల మద్దతు లభించి అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి