Rich Ganesh: వినాయక నవరాత్రోత్సవాలకు భారతావని ముస్తాబవుతోంది. గణనాథుల కోసం మండపాలు సిద్ధమవుతున్నాయి. కొన్ని చోట్ల ఎత్తైన గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఖరీదైన గణనాథుల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వినాయక మండపాల కోసం సినిమా స్టైల్లో భారీ సెట్టింగులు నిర్మిస్తున్నారు. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో అత్యంత సంపన్న గణేష్ మండపాన్ని సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్( జీఎస్బీ) ఏర్పాటు చేస్తోంది. ముంబై కింగ్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న మహా గణపతిని ఈసారి 66 కేజీలకు పైగా బంగారపు ఆభరణాలు, 295 కేజీల వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తున్నట్టు జీఎస్‌బీ సేవా మండల్ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాము ఏర్పాటు చేసిన సంపన్న వినాయక మండపానికి ఏకంగా 316 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్‌ చేయించారు. మండపం నిర్వాహకులతో పాటు దర్శనానిని వచ్చే భక్తులకు కూడా బీమా వర్తించనుంది.  మొత్తం రూ.316 కోట్లకు బీమా చేయించగా.. ఇందులో రూ.31.97కోట్లు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు సంబంధించింది. రూ.263 కోట్లు మండపానికి. మండపం దగ్గర పనిచేసే వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, చెప్పులు భద్రపరిచేవారు, పార్కింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది ఈ ఇన్సూరెన్స్ కిందకు వస్తారు. అగ్నిప్రమాదం, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల కోసం మరో కోటి రూపాయల బీమా చేయించారు.మండపంలోని ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్ల వంటివి ఈ బీమా పరిధిలోకి వస్తాయి.


న్యూ ఇండియా అస్యూరెన్స్ నుంచి సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్ ఇన్సూరెన్స్ తీసుకుంది. గతంలో కూడా గణేష్ మండపానికి బీమా చేయించింది సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్. 2017లో రూ. 264.25 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోగా.. 2018లో ఈ రూ.265 కోట్లకు బీమా చేయించింది. 2019లో గణేష్ మండపానికి రూ.266.65 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది.గత రెండేళ్లు కొవిడ్ కారణంగా సంబరాలను ఘనంగా నిర్వహించలేదు.


Read Also: Jay shah Trolls: జాతీయ జెండా పట్టుకునేందుకు నిరాకరించిన అమిత్ షా కొడుకు! వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్


Read Also: Viral Video: వరద నీటిలో న్యూస్ రిపోర్టర్ మాక్‌లైవ్..వీడియో వైరల్..నెటిజన్ల ఫిదా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి