Mustard Seeds Remedies: మీ దౌర్భాగ్యాన్ని..అదృష్టంగా మార్చుకోండి, ధనికులవండి ఇలా
Mustard Seeds Remedies: మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులకు దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చే శక్తి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీకు ఒకవేళ బ్యాడ్‌టైమ్ వెంటాడుతుంటే..ఆవాలు మీకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తాయి.
Mustard Seeds Remedies: మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులకు దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చే శక్తి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీకు ఒకవేళ బ్యాడ్‌టైమ్ వెంటాడుతుంటే..ఆవాలు మీకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తాయి.
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఉన్నత స్థానంలో రావాలనుంటుంది. జీవితం బాగుండేందుకు ప్రయత్నాలు చేస్తారు. రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితముండదు. ఆర్ధిక ఇబ్బందులు, సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని టిప్స్ పాటిస్తే..జీవితంలో మార్పు తీసుకురావచ్చు. మీ కిచెన్‌లో లభించే వస్తువుతోనే జీవితం మార్చుకోవచ్చు.
ఆవాలతో అద్భుత పరిష్కారం
శాస్త్రాల ప్రకారం వంటింట్లో లభించే ఆవాలతో మీరు మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు. ఎంతగా ప్రయత్నించినా అదృష్టం కలిసి రాకపోతే..అన్ని వైపుల్నించి సమస్యలు చుట్టుముడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అద్భుతమైన రెమిడీ ఉంది. ఓ కుండలో నీళ్లు పోసి..అందులో కొన్ని ఆవాల ఆకులు వేయాలి. శనివారం దాటాక ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాడ్‌టైమ్ పోతుంది. దాంతోపాటు దరిద్య్రం తొలగి రోగాల్నించి విముక్తులౌతారు.
మీ ఇంట్లో ఎవరైనా దిష్టి తగిలి ఇబ్బంది పడుతుంటే..దిష్టి దించేందుకు 7 ఆవాల గింజలు, 7 ఉప్పు పటికలు, ఏడు ఎండుమిర్చిలు తీసుకోవాలి. ఆ తరువాత వీటన్నింటిని కలిపి తీసుకుని..దిష్టి తగిలిన వ్యక్తికి పైనుంచి కింది వరకూ ఏడు సార్లు తిప్పి..వాటిని కాల్చేయాలి. దిష్టి దించేటప్పుడు ఎడమ చేత్తోనే చేయాలని గుర్తుంచుకోవాలి.
మీరు అనుకున్న పనులు ఏమైనా విఫలమౌతుంటే.దానికోసం కోసం ఆవాలు అద్బుతంగా ఉపయోగపడతాయి. ఆదివారం రోజు ఎవరైనా పేదవాడికి ఆవాలు, కొద్దిగా డబ్బులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు పోతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook