Mysore Dussehra celebrations : మైసూరు దసరా వేడుకల విశిష్టత ఏమిటో తెలుసా?
Mysore Dussehra : దసరా వేడుకలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుగుతాయి. అయితే అమ్మ దశావతారాలు ఎత్తి మహిషాసురుని చంపిన తర్వాత కొలువైన ప్రదేశం అదే ప్రస్తుతం మైసూరులో ఈ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలుసా? అసలు మైసూరులో దసరా వేడుకలు ఎప్పుడు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం పదండి..
Dussehra celebrations 2023 :
దసరా సంబరాలు అనగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చే ప్రదేశం మైసూర్. మహిషాసురుని సంహరించిన అమ్మవారి మహిషమ్మ.. ఆ తరువాత మైసమ్మగా మారిందని ఆమె కొలువై ఉన్న ఊరు కనుక దానికి మైసూర్ అని పేరు వచ్చింది అని స్థల పురాణం. దసరా వేడుకలు విజయనగర పాలకుల కాలంలో అంటే సుమారు 15వ శతాబ్దం నుంచి ఘనంగా జరగడం ప్రారంభమయ్యాయి. విజయ నగర వారి పాలన ముగిసిన తర్వాత మైసూరును పాలిస్తున్న వడయార్ రాజులు ఈ వేడుకలను పునరుద్దించరడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపు తీసుకువచ్చారు.
రంగనాథుడు కొలువైయున్న శ్రీరంగం నుంచి 17వ శతాబ్ది తొలినాళ్లలో ఈ వేడుకలను నిర్వహించడం వడయార్ రాజులు మొదలుపెట్టారు. అయితే క్రమంగా 1885 నుంచి వీటిని మూడవ కృష్ణ రాజు వడియార్ హయాంలో మైసూరు లో నిర్వహిస్తూ వచ్చారు. ఈ ప్రకారం వేడుకలను నిర్వహించవలసిందిగా మైసూరు రాజవంశీకులకు తలపాగా పండ్లు కానుకలు ఇచ్చి జిల్లా కలెక్టర్ తొలి ఆహ్వాన పత్రికను సమర్పించడంతో వేడుక పనులు ప్రారంభమవుతాయి. ఇక ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆహ్వానం అందుతుంది.
చాముండీ హిల్స్ ప్రాంతంలోని మైసూర్ ప్యాలెస్ నందు ఈ నవరాత్రులను పురస్కరించుకొని వడియార్ రాజులు అమ్మవారికి దర్బారు ఏర్పాటు చేసి పూజిస్తారు. ఇందులో భాగంగానే చాముండేశ్వరి దేవిని 750 కిలోల బంగారు సింహాసనం పై కొలువు తీరుస్తారు. బంగారు తోరణాలతో, ఏనుగు దంతాలతో ఎంతో ఘనంగా ఉండే ఈ సింహాసనం చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఎంతో రమ్యంగా ఉండే ఈ సింహాసనాన్ని ఒకే ఒక అంజూర్ చెట్టు కలపతో తయారు చేశారు. మామూలుగా ఎంత జాగ్రత్తగా భద్రపరిచే ఈ సింహాసనాన్ని దసరా ఉత్సవాలు జరుగుతున్న 10 రోజులు మాత్రమే సామాన్యులు చూడగలుగుతారు.
ఏనుగు అంబారి ఎక్కించి అమ్మవారిని మైసూర్ ప్యాలెస్ నుంచి సకల రాజనంచనాలతో ఊరిలో ఊరేగిస్తారు. ఇది చూడడానికి దేశ దేశాల ప్రజలు తరలివస్తారు. అమ్మవారి అంబానీ కోసం ప్రత్యేకంగా నాగర హొళె అడవి సమీపంలోని గ్రామం నుండి రెండు బృందాలుగా ఏనుగులను మేలతాలాలతో తీసుకువస్తారు. వీటిలో ఒక బృందంల అమ్మవారి బంగారు అంబారి మోసే ఏనుగులు : బలరామ, అభిమన్యు, గజేంద్ర, అర్జున, రేవతి, సరళ అని పిలవబడతాయి. ఈ ఊరేగింపు పెరేడ్ గ్రౌండ్ సమీపంలోని జమ్మి వృక్షం వద్ద ఏర్పాటు చేసిన బన్ని మంటపం వరకు వెళ్తుంది. ఒకప్పుడు బ్రిటీషర్స్ ఈ ఊరేగింపును జంబో సవారీ అని పిలిచేవారు. ఆ తరువాత 1880 చామరాజ వడయార్ 10 సమయంలో దసరా సందర్భంగా ఎగ్జిబిషన్ ని కూడా ఏర్పాటు చేసే ఆనవాయితీ ప్రారంభమైంది. మైసూర్ ఈ పండుగల సమయంలో జరిగే కుస్తీ పోటీలు చాలా ప్రసిద్ధి.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook