Nagula Chavithi 2024: నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..? పండితులు ఏం చెబుతున్నారు
Nagula Chavithi: ఈ ఏడాది నాగుల చవితి విషయంలో ఒక కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది కొంతమంది నవంబర్ 4న జరుపుకోవాలని వాదిస్తుంటే, మరికొందరు మాత్రం నవంబర్ 5న జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ రోజు నాగులు చవితి జరుపుకోవాలో తెలుసుకుందాం.
Nagula Chavithi: కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. మన పురాణాల్లో నాగజాతికి చెందిన దేవతలను పూజించడం అనేది ఆనవాయితీ. అందుకు తగ్గట్టుగానే మన పురాణాల్లో దేవతలకు నాగుపాము కు ఎంతో అనుబంధం ఉంది శ్రీమహావిష్ణువు శయనించేది శేషతల్పం పైనే, అంటే పావు పడగ నీడన శ్రీమహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు.
శ్రీమహావిష్ణువుకు ఆదిశేషువు అనే సర్పరాజు శేష తల్పంగా ఉన్నారు. అలాగే పరమశివుడికి సైతం మెడలో కంఠాభరణం గా హాలాహలాన్ని గరళంలో నిలిపేలా చేసింది కూడా నాగరాజా కావడం విశేషం. మన సనాతన ధర్మంలో నాగుపాముకు ఎంతో పేరుంది. సనాతన జీవన విధానంలో ప్రకృతిలోని అనేక జీవజాతులకు ప్రాధాన్యత ఉంది. ఆవు నుంచి సర్పం వరకు ఇలా అనేక జంతు జీవ జాలాలను మన పూర్వీకులు ఆరాధిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే నాగ జాతి కోసం నాగ లోకం కూడా ఉంది. అలాంటి నాగజాతిని ఆరాధించే విశిష్టమైన పర్వదినమే నాగుల చవితి. దీపావళి పండగ అమావాస్య అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటారు. ఈ రోజున ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తమ ఇంటి సమీపంలో ఉండే పుట్ట వద్దకు చేరుకొని అక్కడే నాగుపాముల కోసం పుట్టలో పాలు పోస్తారు. అలాగే నాగదేవత కోసం ఒక పూట ఉపవాసం ఉంటారు.
Also Read: Gold News Today: తగ్గేదెలే అంటున్న బంగారం..82 వేలు దాటిన తులం పసిడి
నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే ఈ సంవత్సరం నాగుల చవితి విషయంలో ఒక ధర్మ సంకటం ఏర్పడింది నాగుల చవితి ఎప్పుడు నిర్వహించుకోవాలి అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. ఈసారి క్యాలెండర్లో నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని కొంత మంది చెబుతుంటే, మరికొందరు మాత్రం నవంబర్ ఐదునే నిర్వహించుకోవాలని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
నాగుల చవితి పండుగను శాస్త్ర ప్రకారం చవితి రోజున జరుపుకోవాలి కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండగ జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభం అవుతోంది. ఆ తర్వాత నవంబర్ 5 సూర్యోదయం వేళ చవితి తిథి ఉంటుంది. ఇది రాత్రి 8. 56 నిమిషాల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిధి ఉన్న నేపథ్యంలో నవంబర్ 5వ తేదీ ఇదే నాగుల చవితి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.