Navaratri 2022: దేశవ్యాప్తంగా దేవీనవరాత్రులు నేటి నుంచే ప్రారంభంకానున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ సిద్దమయ్యాయి. ముఖ్యంగా బెజవాడ దుర్గమ్మ (Goddess Durga) గుడి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. నేటి నుంచి అక్టోబరు 05 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మెుత్తం 9 రోజులుపాటు పది అవతారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెుదటి రోజు శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, రెండో రోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి, మూడో రోజు శ్రీగాయత్రీదేవి, నాల్గో రోజు శ్రీఅన్నపూర్ణాదేవి, ఐదో రోజు శ్రీలలితా త్రిపురసుందరిదేవి, ఆరో రోజు శ్రీమహాలక్ష్మీదేవి, ఏడో రోజు శ్రీసరస్వతీదేవి, ఎనిమిదో రోజు శ్రీదుర్గాదేవిగా, తొమ్మిదో రోజు శ్రీమహిషాసురమర్ధిని దేవిగా, విజయదశమి రోజున శ్రీరాజరాజేశ్వరి దేవీ రూపంలో భక్తులకు సాక్షాత్కారమివ్వనున్నారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం లో ఆదివారం నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభమవ్వడం విశేషం. 


హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో శరన్నవరాత్రులు (Navaratri 2022) ఒకటి. ఈ ఉత్సవాలను అశ్విన మాసంలో జరుపుకుంటారు. ఈ పండుగను సంవత్సరానికొకసారి జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈసారి దసరా లేదా విజయ దశమి అక్టోబరు 5న వస్తుంది. 


Also Read: Devi Navaratri 2022: నవరాత్రుల్లో ఈ మొక్కలను నాటితే.. మంచి ఫలితాలు పొందుతారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook