Nirjala Ekadashi Significance: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈసారి నిర్జల ఏకాదశి 10 జూన్ 2022 (Nirjala Ekadashi 2022) శుక్రవారం నాడు వస్తుంది. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా మీకు పుణ్యం లభిస్తుంది. ఉపవాసం చేసేటప్పుడు నీరు కూడా ముట్టకూడదు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని (Nirjala Ekadashi Vrat) ఆచరించడం ద్వారా...ఆ వ్యక్తి సంవత్సరంలోని 24 ఏకాదశులను ఆచరించినంత ఫలితం పొందుతారని నమ్ముతారు. ఈ ఏకాదశి చేయడం అంత సులభం కాదు. ఇందులో విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించాలి. నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాలను గుర్తుంచుకోండి
>> నిర్జల ఏకాదశి వ్రతం చాలా పవిత్రమైనది. ఈ రోజు ఉపవాసం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది వేసవికాలం, పైగా నీరు తాగకూడదు. మీరు ఆరోగ్యంగా ఉంటనే ఈ వ్రతం చేయడానికి పూనుకోండి. 
>>  మీరు నిర్జల ఏకాదశి చేయాలనుకుంటే...ఉపవాసానికి ఒక రోజు ముందు (దశమి రోజు) నుండే మీ ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మాంసాహారం ముట్టవద్దు, మద్యానికి దూరంగా ఉండండి. 
>> ఈ ఉపవాసంలో ఉన్న వ్యక్తి  నీరు తాగకూడదు. కానీ బాటసారులు, జంతువులు మరియు పక్షులు నీరును పెట్టవచ్చు. కనీసం టెర్రస్-బాల్కనీలో పక్షులకు నీరు అందించండి. 
>> నిర్జల ఏకాదశి ఉపవాసం అంటే శారీరక మరియు మానసిక నిగ్రహాన్ని పాటించడం. ఈ రోజు బ్రహ్మచర్యాన్ని అనుసరించండి. అలాగే మీ మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలు తీసుకురావద్దు.
>> మీరు ఏకాదశి వ్రతం పాటించకపోయినా, ఆ రోజు అన్నం తినకూడదు. అంతే కాకుండా వంకాయ, పనసపప్పు వంటివి తినడం నిషిద్దం.
>> దాన ధర్మాలు కూడా చేసినప్పుడే ఈ వ్రతం పూర్తవుతుంది. కావున ఉపవాస దినాన, మీ శక్తి మేరకు దానాలు చేయండి.


Also Read: Shani Dev: శని దేవుడి దయ ఈ 3 రాశులవారిపై ఎల్లప్పుడూ ఉంటుంది, అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook