October Horoscope 2023: అక్టోబర్ నెల ఈ మూడు రాశులకు అన్నీ సమస్యలే, తస్మాత్ జాగ్రత్త
October Horoscope 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి నెలా ప్రతి వారం కూడా జాతకం మారిపోతుంటుంది. గ్రహాల కదలిక, రాశి పరివర్తనం, నక్షత్రాల మార్పు వంటివి జాతకంలో మార్పులకు కారణమౌతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
October Horoscope 2023: జాతక రీత్యా కొన్ని నెలల్లో కీలక పరిణామాలు జరుగతుంటాయి. అదే విధంగా అక్టోబర నెల 3 రాశులకు అత్యంత క్లిష్ట సమయంగా పరిగణించాల్సి ఉంటుంది. పలు సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. జీవితంలో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. అక్టోబర్ నెలలో ఏ జాతకులకు ఇబ్బంది కలుగుతుందో పరిశీలిద్దాం..
అక్టోబర్ నెలలో ప్రారంభం కావడంతో ఈ నెల ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా జాతకం నమ్మేవారిలో అధికంగా ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెలలో ప్రయాణాలు జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ నెలలో సేవింగ్స్ పెద్దగా కన్పించవు. కుటుంబ జీవితంలో సవాళ్లు సమస్యగా మారతాయి. ఆర్ధికంగా ఇబ్బందులుంటాయి. కుటుంబ సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. డబ్బులు సంపాదించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
మీన రాశి జాతకులకు అక్టోబర్ నెల ప్రతికూల పరిస్థితుల్ని తెచ్చిపెడుతుంది. ఆర్ధికంగా చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఈ రాశివారికి డబ్బులు సంపాదించడంలో కష్టాలు ఎదురౌతాయి. అనుకోని ప్రయాణాలు రావడంతో ఆర్ధికంగా మరింత ఇబ్బంది ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి శుభ పరిణామం ఎదురుకావచ్చు. కుటుంబసభ్యుల మధ్య సామరస్యత కొరవడటంతో ఇంట్లో గొడవలు, అశాంతి ఉంటాయి. ఫలితంగా కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటాయి.
మకర రాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా ప్రతికూలమైందనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ఎగుడుదిగుడు ఉంటుంది. జీవితంలో చాలా సమస్యలు ఎదురు కావచ్చు కానీ మాట తీరుతో ప్రతి సమస్యకు పరిష్కారం సాధించవచ్చు. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా ఉండాలి. అహంకారం వంటి కారణాలతో కుుటంబసభ్యుల మధ్య ఘర్షణ ఉంటుంది. ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరిగిపోవచ్చు. సేవింగ్స్ ప్రశ్నే తలెత్తదు. ఇంట్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇది మీ సమస్యల్ని మరింత పెంచవచ్చు. ఊహించని ధనహాని కలుగుతుంది. తస్మాత్ జాగ్ర్తత్త.
కుంభ రాశి జాతకులకు అక్టోబర్ నెలలో అంత సానుకూల పరిస్థితులు ఉండవు. ఈ నెలలో వైవాహిక బంధంలో ఆటంకం రావచ్చు. దీనికి కారణం భార్యాభర్తల మధ్య నమ్మకం సన్నగిల్లడమే. కుటుంబ జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో కుటుంబీకుల పట్ల ప్రేమ తగ్గడంతో సహజంగానే దూరం పెరుగుతుంది. కుటంబీకుల మధ్య పొరపాట్ల కారణంగా సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇంట్లో కుటుంబీకులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.
Also read: Sun transit 2023: సూర్యుడి గోచారంతో అక్టోబర్ 18 నుంచి 5 రాశులపై కనకవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook