Sankashtahara Chaturthi 2024: నేడు సంకష్టహర చతుర్థి ఈరోజు గణనాథుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతినెల సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈనెల మార్చి 28 గురువారం సంకష్టహర చతుర్థి వచ్చింది. ఈరోజు కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల వినాయకుని కృపతో త్వరగా అప్పుల ఊబి నుంచి కూడా బయటపడతారు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన హిందూ మతంలో వినాయకుడిని ఆదిదేవుడిగా పూజిస్తాం. ఈయన జ్ఞానదేవుడు. సంకష్ట చతుర్థిరోజు గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజు. సాధారణంగా ఈరోజు సాయంత్రం చంద్రుడిని పూజిస్తాం. అయితే, సంకష్టహర చతుర్థిరోజు వినాయకుని పూజించడం వల్ల అప్పుల ఊబి నుంచి సులభంగా బయటపడతారు. ఈరోజు రుణహర్త గణేశ స్తోత్రాన్ని పఠించాలి. దీంతో త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు.


అంతేకాదు సంకష్టహర చతుర్థినాడు గణేషుడికి లడ్డూలను సమర్పించి ప్రసాదంగా తీసుకుంటే మీపై వినాయకుడి ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు వృత్తి వ్యాపారాల్లో కూడా పురోగతి కోరుకుంటే ఈరోజు మీ రాశిని అనుసరించి రుద్రాక్షను ధరించాలని పండితులు చెబుతున్నారు.


మీరు ఏదైనా ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే సంకష్టహర చతుర్థినాడు వినాయకుడికి ఉపవాసం ఉండండి. పూజ చేసి సంకష్టహర గణేశ స్తోత్రాని పఠించండి. పూజలో గణపతికి నెయ్యిదీపం వెలిగించి మోదకం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. 


ఇదీ చదవండి: వచ్చే నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం.. మన దేశంపై ప్రభావం ఉంటుందా?


సంకష్టహర చతుర్థిరోజు వినాయకుడికి వెండి గిన్నెలో తమలపాకు, లవంగం, జాజికాయ సమర్పిస్తే మీరు అనుకున్న పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు. అంతేకాదు కుటుంబంలో కూడా సఖ్యత ఏర్పడుతుంది.పూజ సమయంలో మీరు గణపతి అనుగ్రహం కోసం గణేశ మంత్రాన్ని పఠించాలి.


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభః నిర్విఘ్నం
కురుమిన్ దేవ్ సర్వ కరీషు సదా..


ఇదీ చదవండి: తమలపాకును దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా?


మంత్రాన్ని సంకష్టహర చతుర్థిరోజు పఠించాలి.  దీంతో ఆయన కృపతో మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. మీ పిల్లలు కూడా చదువులో బాగా రాణించాలంటే ఈరోజు దగ్గర్లోని ఏదైనా గణపతి ఆలయానికి పిల్లలను కూడా తీసుకుని వెళ్లండి. అక్కడ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నువ్వులు దానం చేయించండి. దీంతో వాళ్లు గణపతి కృపతో విద్యలో బాగా రాణిస్తారు. వారికి విజయం త్వరగా వరిస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి