Benefits Of  Betel Leaves: మీరు  ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నా, ఇంట్లో అశాంతి, రోగాలు చుట్టిముట్టినట్టిన మీరు తమలపాకులను (Betel Leaves) ఉపయోగించడం ద్వారా మీ సమస్యల నుండి బయటపడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సనాతన ధర్మంలో పూజకు అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తారని మనందరికీ తెలుసు. ఈ పదార్ధాలలో ప్రతి దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇలా ఉపయోగించే వాటిల్లో తమలపాకు ఒకటి. చాలా మంది తమలపాకులను తినదగినదిగా మాత్రమే భావిస్తారు. కానీ దీనిని  దేవతలను కూడా పూజించడానికి ఉపయోగిస్తారు.


హనుమంతుడికి తమలపాకును సమర్పించండి
మంగళ, శనివారాల్లో తమలపాకులను బజరంగ్ బలికి (Lord Hanuman) సమర్పిస్తే, ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని మత గ్రంథాలలో చెప్పబడింది. దీనితో పాటు, ఇంట్లో ఇబ్బందులు మరియు వ్యాధులు కూడా పారిపోతాయి. తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి, మానసిక శక్తి పెరుగుతుంది.


గణపతిని ఇలా పూజించండి...
మీరు ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించాలనుకుంటే, తమలపాకులపై కుంకుమను ఉంచి గణేశుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల గజాననుడు (Lord Ganesh) సంతోషిస్తాడు మరియు జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాడు.


ఇంట్లో ప్రతికూలత పోవాలంటే..
మీ ఇంట్లో ప్రతికూలత వ్యాపించి, కుటుంబ సభ్యుల మధ్య అశాంతి వాతావరణం నెలకొంటే తమలపాకును ఇంటి ప్రధాన ద్వారంపై ప్రతిరోజూ వేలాడదీయడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలో నివసిస్తుందని నమ్ముతారు.


తమలపాకును కోయకూడదు
ఇంట్లో పూజా చేసేటప్పుడు తాజా తమలపాకులనే  ఉపయోగించండి. తమలపాకును ఎప్పుడూ చీల్చకండి. ఇలా చేయడం వల్ల పూజ చేసినా ఫలితం మాత్రం దక్కదు. 


Also Read: Chanakya Niti: మోక్షం పొందడానికి చాణక్యుడు చెప్పిన అద్బుతమైన 4 విషయాలు తెలుసుకోండి! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook