Pancha Graha Kutami 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ జూన్‌ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడుతో పాటు శని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అలాగే ఇదే సమయంలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతోంది. ఇది జూన్‌ 5వ తేదిన ఏర్పడబోతోంది. దీని కారణంగా అశుభ, శుభ పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే మిథునరాశిలో జూన్ 12న శుక్రుడు, 14న బుధుడు, 15న సూర్యడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా మిథున రాశిలో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడబోతోంది. అంతేకాకుండా సూర్య, బుధ కలయిక కారణంగా కూడా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ యోగాలు ఏర్పడిన కొద్ది రోజుల్లోనే లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
జూన్‌ నెలలో ఏర్పడే ప్రత్యేకమైన యోగాల కారణంగా మేష రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా పాట పెట్టుబడుల్లో కూడా లాభాలు వస్తాయని జ్యోతిష్యులు అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా పురోగతి లభిస్తుంది. అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా పుట్టుకు వస్తాయి. 


మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ నెలలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో డబ్బులను కూడా సులభంగా ఆదా చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఎంతగానో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సంబంధిత సమస్యలు కూడా ఈ నెలలో పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. 


కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలు కూడా చేసుకునే చాన్స్‌ ఉంది. దీంతో పాటు పనికి ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు. ఆదాయ వనరులు వినియోగించే క్రమంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతగానో మెరుగుపడతాయి. దీంతో పాటు డబ్బుకు సంబంధించిన విషయాంలో కూడా మార్పులు వస్తాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వీరికి సంపాదన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వనరుల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. దీంతో పాటు వీరికి ధన ప్రవాహం కూడా రెట్టింపు అవుతుంది. వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించే ఛాన్స్‌ ఉంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి