Papmochini Ekadashi 2023: హిందూ క్యాలెండర్‌లోని 24 ఏకాదశిలలో చివరిది పాపమోచనీ ఏకాదశి. ఇది చైత్ర మాసంలో కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి నాడు వస్తుంది. దక్షిణ భారత క్యాలెండర్ ప్రకారం, ఈ ఏకాదశి ఫాల్గుణ మాసంలో జరుపుకుంటారు. పాపాల నుండి విముక్తి చేస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని పాపమోచనీ ఏకాదశి అంటారు. ఇది హోలికా మరియు చైత్ర నవరాత్రుల మధ్య వస్తుంది. ఈరోజున నియమనిష్టలతో విష్ణువును పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దొంగతనం, మద్యపానం, అహింస, భ్రూణహత్య వంటి అనేక పాపాలు నుండి బయటపడతారు. పాపమోచనీ ఏకాదశి తేదీ, శుభ సమయం మరియు పూజ విధానం గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాపమోచనీ ఏకాదశి 2023 తేదీ & సమయం
పాపమోచనీ ఏకాదశి మార్చి 18, 2023, శనివారం జరుపుకుంటారు. పాపమోచిని ఏకాదశి తిథి మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 2.06 గంటలకు ప్రారంభమై మార్చి 18వ తేదీ ఉదయం 11.13 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, మార్చి 18న పాపమోచని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. ఈ ఉపవాసం యొక్క పారణ సమయం మార్చి 19న ఉంటుంది. పారణ సమయం మార్చి 19, 2023 ఉదయం 06.27 నుండి 08.07 వరకు ఉంటుంది. మార్చి 18 ఉదయం 07:58 నుండి 09:29 వరకు పూజకు అనుకూల సమయం. 


పూజా విధానం
ఏకాదశి నాడు సూర్యోదయ సమయంలో స్నానమాచరించి ఉపవాసం దీక్ష తీసుకోవాలి. దీని తరువాత షోడశోపచార పద్ధతిలో విష్ణుమూర్తిని పూజించాలి. అనంతరం ధూప, దీప, చందనం, పండ్లు మెుదలైన వాటిని సమర్పించి హారతి ఇవ్వండి. ఈ పవిత్రమైన రోజున పేదవారు మరియు బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి. 


Also read: Mangal Gochar 203: అరుదైన రాజయోగాన్ని సృష్టించిన కుజుడు.. ఈ రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook