Parama Ekadashi Vrat August 2023: జ్యోతిష్య శాస్త్రంలో పరమ ఏకాదశికి విశేష ప్రాముఖ్య ఉంది. ఈ ఏకాదశి మూడేళ్లకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో భక్తులంతా శ్రీమహా విష్ణువుకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఊపవాసాలు పాటిస్తారు. అయితే ఈ సంవత్సరం పరమ ఏకాదశి ఆగస్టు 12వ తేది (ఈ రోజు)న వచ్చింది. ఈ రోజు ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అందుకే చాలా మంది భక్తులు ఈ రోజు శ్రీమహా విష్ణువుకు ఉపవాసాలు పాటిస్తారు. అయితే ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధికమాసం ఉండడం వల్ల ఏకాదశుల సంఖ్య పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి పరమ ఏకాదశికి ప్రాముఖ్యత గురించి తెలియదు. అయితే ఈ ఏకాదశి ప్రాముఖ్య, ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రావణ అధిక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసాలు పాటించి..శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.ఈ రోజు శనివారం కావడంతో ఈసారి పరమ ఏకాదశి వ్రతం ప్రాధాన్యత మరింత పెరిగిందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏకాదశి శుభ సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల శని దుష్ప్రభావం నుంచి విముక్తి కలుగుతుందట. అంతేకాకుండా ఈ రోజు ఉసిరి చెట్టు కింద నాలుగు ముఖాల ఆవనూనె దీపం వెలిగించి శని స్తోత్రాన్ని పఠించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


అంతేకాకుండా ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకికి ఆహారాలు పెట్టడం వల్ల సులభంగా శని దోషం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పిత్రు దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. పూర్వీకులు పరమ ఏకాదశి రోజున తప్పకుండా కాకులకు ఆహారాలు పెట్టేవారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. వాటికి ఆహారాలు పెట్టి పూజా కార్యక్రమాలు ప్రారంభించేవారని వారు చెబుతున్నారు. 


పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో అరుదైన విజయాలు పొందుతారనీ పురాణాల నమ్మకం. అంతేకాకుండా కొంత మంది ఈ రోజు శ్రీమహా విష్ణువుని పూజించి అన్నదానం, విద్యాదానం,  స్వర్ణదానం కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజు వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా మహావిష్ణువుకు పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి