Parivartini Ekadashi 2022 Date and Time: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశినే పరివర్తిని ఏకాదశి అంటారు. దీనినే జల్జుల్ని ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ సారి ఈ పరివర్తిని ఏకాదశి  06 సెప్టెంబర్ 2022న వస్తుంది.  ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును (Lord Vishnu) పూజించడం అనవాయితీ. ఈ పరివర్తిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల వాజపేయ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది పరివర్తిని ఏకాదశి (Parivartini Ekadashi 2022) నాడు అద్భుతమైన యోగం ఉంది.  పరివర్తినీ ఏకాదశి యొక్క శుభ సమయం, శుభ యోగం మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరివర్తిని ఏకాదశి 2022 ముహూర్తం
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 06 సెప్టెంబర్ 2022 మంగళవారం ఉదయం 05:54 గంటలకు ప్రారంభమై... 07 సెప్టెంబర్ 2022 బుధవారం తెల్లవారుజామున 03:04 గంటలకు ముగుస్తుంది.
పారణ సమయం - 7 సెప్టెంబర్ 2022, ఉదయం 08.19 - 08.33 


శుభ యోగం
ఈసారి పరివర్తిని ఏకాదశి నాడు చాలా ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరుగబోతుంది. ఈ రోజున నాలుగు యోగాలు ఏర్పడుతున్నాయి. పరివర్తినీ ఏకాదశి నాడు ఆయుష్మాన్, రవి, త్రిపుష్కర్, సౌభాగ్య యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి పనిలో సఫలీకృతులవుతారు.
ఆయుష్మాన్ యోగం - 5 సెప్టెంబర్ 2022,  ఉదయం 11:28 - ఉదయం 6 సెప్టెంబర్ 2022, 08:16 
సౌభాగ్య యోగం - 6 సెప్టెంబర్ 2022, ఉదయం 08:16 AM - 7 సెప్టెంబర్ 2022, సాయంత్రం 04:50 
రవి యోగం - ఉదయం 06:08 - సాయంత్రం 06:09 (6 సెప్టెంబర్ 2022)
త్రిపుష్కర యోగం - తెల్లవారు జామున 03:04 - ఉదయం 06:09 (7 సెప్టెంబర్ 2022)


పరివర్తిని ఏకాదశి ప్రాముఖ్యత
పరివర్తినీ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల మరణానంతరం మోక్షం లభిస్తుంది. మత గ్రంథాల ప్రకారం, ఈ రోజున విష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనుడిని పూజిస్తారు. 


Also Read: కన్యారాశిలో లక్ష్మీ నారాయణ యోగం... అంతులేని సంపద ఈ రాశుల సొంతం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook