Astrology: ఈ రాశుల వారు ప్రేమించినంత ఈజీగా బ్రేకప్ చెప్తారు! అందులో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి?
Personality by Zodiac Sign: జ్యోతిష్యంలోని ప్రతి రాశిచక్రం ప్రకారం, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెప్పబడింది. దీని ప్రకారం, కొంత మంది తమ భాగస్వామితో ఈజీగా విడిపోతారు.
Astrology for Love Life: జీవితానికి ప్రేమ చాలా ముఖ్యం. కొంత మంది లవ్ మాత్రమే సక్సెస్ అవుతుంది. నిజమైన ప్రేమను పొందినవారు చాలా అదృష్టవంతులు. అయితే కొంత మంది లవ్ స్థిరంగా ఉండదు. వీరికి బ్రేకప్ లు ఎక్కువగా అవుతాయి. అంతేకాకుండా వీరు తమ లవర్ ను తరచూ మారుస్తూ ఉంటారు. వీరు ఎంత తొందరగా ప్రేమలో పడతారో, అదే విధంగా విడిపోతారు. దీని కారణం వారి రాశులే. ఆస్ట్రాలజీ (Astrology) ప్రకారం, మూడు రాశులవారు భాగస్వామితో కలిసి జీవించలేరు. తరచూ ఏదో కారణాల వల్ల విడిపోతూ ఉంటారు. ఆ రాశులేంటో చూద్దాం.
మేషం (Aries): మేష రాశి వారికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఒక్కోసారి వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాదు. అందువల్ల భాగస్వామి తరచూ గొడవలు అవుతుంటాయి. వీరు తమ భాగస్వామితో విడిపోయి.. మరో వ్యక్తితో సులభంగా మింగిల్ అవుతారు.
తుల (Libra): తుల రాశి వారు చాలా సందర్భాలలో సమతుల్యతతో ఉంటారు. కానీ అదే సమయంలో వారు చాలా భావోద్వేగంగా కూడా ఉంటారు. తమ పరిమితికి మించి ఉద్వేగభరితంగా ఉండటం వల్ల వారు మాట్లాడిని చిన్న విషయాలు కూడా వారి భాగస్వామి నుండి దూరం చేస్తుంది. ఈ కారణాల వల్ల, వారు త్వరగా విడిపోతారు.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారు కొంచెం స్వార్థపరులు అయితే రిలేషన్ షిప్ విషయంలో స్వభావాన్ని మార్చుకుంటారు. వారు సంబంధాన్ని కొనసాగించడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ భాగస్వామి చేతిలో నుండి బయటపడటం ప్రారంభించినప్పుడు, వారు అతనిని విడిచిపెట్టడానికి ఎక్కువ సమయం తీసుకోరు. ఈ వ్యక్తులు కూడా సంబంధాన్ని చేదుతో నింపడానికి ఇష్టపడరు మరియు త్వరలో మరొక భాగస్వామిని కూడా కనుగొనలేరు.
Also Read: Vastu Tips for Haldi Plant: ఇంట్లో పసుపు మెుక్కను నాటడం శుభప్రదమా? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.