Pitru Paksha 2022: పితృ పక్షం అంటే.. చనిపోయిన మన పూర్వీకులు మనల్ని ఆశీర్వదించడానికి మళ్లీ భూమి పైకి వస్తారని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే పితృ దేవతలను సంతృప్తి పరిచేందుకు, వారి అనుగ్రహం పొందేందుకు పితృ పక్షంలో శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. ఈసారి పితృ పక్షం సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఉండనుంది. పితృ పక్షంలో కొంతమందికి తమ పూర్వీకులు కలలోకి వస్తారు. గరుడ పురాణం ప్రకారం ఇలాంటి కలలు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో పూర్వీకులు.. గరుడ పురాణం ఏం చెబుతోంది


గరుడ పురాణం ప్రకారం.. పితృ పక్షంలో పూర్వీకులు కలలో కనిపించడమంటే వారి ఆత్మ ఇంకా సంచరిస్తోందని అర్థం. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే ఇంట్లో రామాయణం లేదా గీతా పారాయణం చేయాలి. ఒకవేళ కలలో తమ పూర్వీకులు ఇంటి దగ్గరే తచ్చాడుతున్నట్లు కనిపిస్తే.. మీపై ప్రేమను వారు ఇంకా వదులుకోలేకపోతున్నారని అర్థం. దీనికి పరిహారం.. ప్రతీ రోజూ ఆవుకు రొట్టెలు తినిపించాలి. అమావాస్య రోజున పూర్వీకులకు నైవేద్యం సమర్పించాలి. తద్వారా పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది.


ఆ కలలకు అర్థమేంటి.. :


పితృ పక్షంలో పూర్వీకులు మిమ్మల్ని కలలో ఆశీర్వదిస్తే లేదా సంతోషంగా కనిపిస్తే.. మీ శ్రాద్ధ తర్పణలు, నైవేద్యాల పట్ల వారు సంతృప్తితో ఉన్నట్లు అర్థం. ఇలాంటి కలలు మంచివని గరుడ పురాణం చెబుతోంది. పూర్వీకులు చెప్పులు లేకుండా కలలో కనిపించట్లయితే.. వారు మీ నుంచి ఏదో దానాన్ని కోరుతున్నారని అర్థం. అలాంటప్పుడు పేదలకు తోచిన దానం చేయడం ద్వారా వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది.


అలాంటి కలలు శుభ సంకేతం


పితృ పక్షంలో చాలా మందికి తమ కలలలో వారి పూర్వీకులు ఇంటి దగ్గరే సంచరిస్తున్నట్లు కనిపిస్తారు. అలాంటప్పుడు అమావాస్య రోజున పూర్వీకులకు భోగ్ నైవేద్యం సమర్పించాలి. తద్వారా పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. కొంతమందికి కుటుంబ సభ్యుల మరణం కలలో కనిపిస్తుంటుంది. ఇది రాబోయే కాలంలో మీకు శుభవార్తల సంకేతంగా గరుడ పురాణంలో చెప్పబడింది.


(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కొన్ని విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.)


Also Read: JP NADDA MEETING LIVE UPDATES: కాసేపట్లో హైదరాబాద్ కు జేపీ నడ్డా..  హీరో నితిన్, టీవీ9 రామేశ్వరరావు బీజేపీలో చేరనున్నారా?


Also Read: Chiranjeevi: రెండు, మూడు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చిరంజీవి... కారణమిదే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook