Pitru Paksha 2022: పితృ పక్షం మరో వారం రోజుల్లో ప్రారంభకానుంది. ఇది సెప్టెంబరు 10న మెుదలై...సెప్టెంబరు 25 వరకు కొనసాగుతుంది. ఈ పదిహేను రోజుల సమయంలో పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం వంటివి చేస్తారు. పితృ పక్షంలో (Pitru Paksha 2022) చనిపోయిన పూర్వీకుల ఆత్మలు భూమికి వస్తాయనే నమ్ముతారు. అయితే పితృ పక్షం సమయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పనులకు దూరంగా ఉండండి..
>> పితృ పక్షం సమయంలో అన్నం, మాంసం, వెల్లుల్లి, ఉల్లి, వంకాయ, తామసిక మరియు బయటి ఆహారం తినడం మానుకోండి. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి. శ్రాద్ధ ఆహారంలో పప్పు, ఉసిరి, శెనగ, నల్ల జీలకర్ర, నల్ల ఉప్పు, నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు. 


>> పితృ పక్షంలో శ్రాద్ధం చేయాల్సిన వ్యక్తి... తన జుట్టు, గడ్డం మరియు గోర్లు కత్తిరించకూడదు. ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించడం కూడా మానుకోవాలి. పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు. లెదర్ పర్సు ఉపయోగించకూడదు. 


>> శ్రాద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు.. ఎలాంటి అంతరాయం కలిగించవద్దు. పితృ పక్షం సమయంలో పొగాకు, సిగరెట్లు, మద్యం, గుట్కా వంటి వాటిని మానుకోండి. ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు.


>> శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు. ఇది మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది. పూజకు ఇనుప పాత్రలను ఉపయోగించవద్దు. దానికి బదులుగా బంగారం, వెండి, రాగి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించండి.


>> పితృ పక్షం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొత్త వస్తువులు, కొత్త బట్టలు కొనకూడదు.  


Also Read: Mahalaxmi Vratam 2022: మహాలక్ష్మీ వ్రతం ఎప్పుడు, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook