Grah Gochar November 2022: ఈ నెలలో కొన్ని ప్రధాన గ్రహాలు సంచరించనున్నాయి. ఆస్ట్రాలజీ ప్రకారం, నవంబర్ 11న శుక్రుడు, 13న బుధుడు, 16న సూర్యుడు వృశ్చికరాశిలో సంచరించనున్నారు. ఒకే రాశిలో మూడు పెద్ద గ్రహాల సంచారం శుభ యాదృచ్చికాలను చేస్తుంది. వృశ్చికరాశిలో మూడు రాశుల కలయిక మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని  చూపుతుంది. ఇది కొన్ని రాశులవారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఈ గ్రహాల కలయిక వల్ల  ఏరాశులవారికి లాభం కలుగనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): ఈ రాశి వారికి శుక్ర, బుధ, సూర్య భగవానుల సంచారం మేలు చేస్తుంది. వీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. సంతానం లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంది. 


సింహరాశి (Leo): శుక్రుడు రాశి మారడం వల్ల ఈ రాశి వారి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఈరాశివారికి బుధుడి అనుగ్రహం ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. సూర్యభగవానుని సంచారం వల్ల మీరు వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు.  


తులారాశి (Libra): ఈ గ్రహాల సంచారం తులారాశి వారికి లాభాలను అందిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ ఆదాయం పెరుగుతుంది. డబ్బును ఆదా చేస్తారు. బుధగ్రహ సంచారం వల్ల ఈరాశివారికి విదేశీయానం కలుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం మీకు కలిసి వస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 


వృశ్చిక రాశి (Scorpio): ఈ మూడు గ్రహాలు ఈ రాశిలోనే సంచరించనున్నాయి. ఈ రాశివారు అనేక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో లాభం, వృత్తిలో పురోగతి సాధిస్తారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను పొందుతారు.  మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also Read: Gajakesari Yoga: నవంబర్ 5న గజకేసరి యోగం.. ఈ రాశులకు అదృష్టం..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook