Planet transits 2023: ఏప్రిల్ నెల జ్యోతిష్యం ప్రకారం అత్యంత కీలకం ఎందుకంటే ఈ నెలలోనే గురు, బుధ, శుక్ర, సూర్య గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ఉంది. ఈ నాలుగు గ్రహాల గోచారం 5 రాశులపై నోట్లవర్షం కురిపిస్తుంది. ఊహించని లాభాలు తెచ్చిపెడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ నెలలో చాలా గ్రహాలు గోచారం చేస్తున్నాయి. ఏడాదికోసారి రాశి పరివర్తనం చెందే గురుగ్రహం ఏప్రిల్ 2023లో  సొంతరాశి మీనం నుంచి బయటికొచ్చి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. మేష రాశిలో అప్పటికే రాహువుతో కలిసి సూర్యుడుంటాడు. ఏప్రిల్ 22న గురుడి గోచారం తరువాత మేషరాశిలో గురు, రాహు గ్రహాలుండి గురు చండాల యోగం ఏర్పరుస్తాయి. దాంతో పాటు శుక్రుడు, బుధ గ్రహాలు కూడా రాశి మారుతాయి. సూర్యుడు కూడా రాశి పరివర్తనం చేస్తాడు. అంటే ఏప్రిల్ నెలలో గ్రహాల గోచారం వల్ల మొత్తం 12 రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా 5 రాశులకు అత్యంత శుభ పరిణామాలకు కారణం. 


ఏప్రిల్ 2023లో అదృష్ట రాశులు


కుంభ రాశి


గ్రహాల గోచారం ఫలితంగా ఏప్రిల్ నెల అత్యంత శుభసూచకం. ఈ రాశివారికి చాలా విషయాల్లో రిలీఫ్ ఇస్తుంది. పాత సమస్యలు దూరమౌతాయి. పనిలో విజయం లభిస్తుంది. కష్టమైన పనులు కూడా పూర్తయిపోతాయి. ఏదైనా సమస్య పీడిస్తుంటే తొలగిపోతుంది. ఆర్ధికంగా లాభాలుంటాయి.


కర్కాటక రాశి


ఏప్రిల్ నెల కర్కాటక రాశి జాతకులకు అత్యంత శుభంగా చెప్పవచ్చు. ఒకరి సహాయంతో కీలక పని పూర్తి చేస్తారు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. కొత్తవారితో పరిచయం లాభాల్ని ఇస్తుంది. కుటుంబంలో ఆనందం ఉండటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఊహించని ధన సంపద ఉంటుంది. 


మీన రాశి


ఏప్రిల్ నెలలో గ్రహాల గోచారం ప్రభావం మీన రాశి జాతకులకు పనుల్లో విజయాన్ని అందిస్తుంది. మీరు ఓ విషయంలో ఊహించని విజయం సాధిస్తారు. ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్ట స్థితికి చేరుతారు. ఏదైనా గుడ్‌న్యూస్ మిమ్మల్ని ఆనందపరుస్తుంది. 


వృషభ రాశి


ఏప్రిల్ నెల గ్రహాల గోచారం ప్రభావం వృషభ రాశి జాతకులపై అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కుటంబం సహకారం పూర్తిగా లభిస్తుంది. డబ్బు విషయంలో ఈనెల చాలా బాగుంటుంది. అంటే నోట్లవర్షం కురుస్తుందని చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దు.


మిథున రాశి


ఏప్రిల్ నెల మిథున రాశి జాతకులకు చాలా చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సాహసం, పరాక్రమం చూపించే అవకాశముంటుంది. వ్యాపారంలో భారీ విజయం సాధిస్తారు. ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 


Also read: Sun Transit 2023: సూర్య గోచారం ప్రభావంతో ఆ 4 రాశులకు ఊహించని సంపద, ఏప్రిల్ 14 నుంచి మారనున్న దశ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook