Grah Rashi Parivartan Prabhav 2023: గ్రహాల సంచార పరంగా మార్చి నెల చాలా ముఖ్యమైనది. మార్చిలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రానుంది. వచ్చే నెలలో కుజుడు మిథునరాశిలోకి, బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించనున్నారు. మీనరాశిలో బుధుడు, గురుగ్రహాల రాకతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అదే నెల చివరిలో బుధుడు మళ్లీ రాశిని మార్చుకుని... మేషరాశికి వెళ్తాడు. మార్చి నెలలో ఈ ఫ్లానెట్స్ సంచారం వల్ల 5 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి
మార్చిలో ఈ రాశివారిపై శని, రాహు ప్రభావం ఉంటుంది. దీని కారణంగా మీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఈ సమయంలో మీ కోపం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు లభించవు. అంగారకుడి ప్రభావం వల్ల పనుల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. 
సింహరాశి 
సూర్యుడు మరియు అంగారకుడి దృష్టి సింహరాశిపై ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడాలంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు మానసికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. సూర్యుడి గమనం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. 
కన్య రాశి
గ్రహాల సంచారంల వల్ల కన్యా రాశి వారికి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటారు. మీరు డబ్బు సంపాదించడంలో ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. 
మకరరాశి
గ్రహాల సంచారం కారణంగా మకర రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. మీ ఫ్యామిలీలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అంతగా బాగుండదు. 
కుంభ రాశి
ఫ్లానెట్స్ సంచారం వల్ల ఆఫీసులో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. 


Also Read: Astrology: మేష రాశిలో గ్రహాల రాజు-దేవగురు కలయిక.. ఈరాశులకు లక్కే లక్కు... డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.