Planet Changes 2022: నేటి నుంచే నవంబరు నెల ప్రారంభమైంది. ఈనెల ప్రారంభంలో కొన్ని ముఖ్యగ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. అయితే ప్రధాన గ్రహాలైన మెర్య్కూరీ, మార్స్ ఒకే రోజున రాశిని మారుస్తున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవంబర్ 13, 2022న కుజుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తే..అదే  రోజు బుధుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తున్నాయి.  ఈ రెండు గ్రహాల రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- నవంబర్‌లో కుజుడు మరియు బుధుడు రాశిచక్రం మారడం వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశి యెుక్క 2వ మరియు 5వ గృహాలకు బుధుడు మరియు 7వ మరియు 12వ గృహాలకు అంగారకుడు అధిపతి.  దీంతో బుధుడు ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలను ఇవ్వగలడు. వర్క్ ప్లేస్ లో పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. అంగారక సంచారం వివాహానికి శుభప్రదం అవుతుంది. 


కర్కాటకం (Cancer)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి విద్యార్థులకు ఈ రెండు గ్రహాల సంచార ప్రయోజనం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. 


సింహం (Leo)- కుజుడు ఈ రాశిచక్రం యొక్క తొమ్మిదవ మరియు త్రిభుజ గృహంలో సంచరించబోతున్నాడు, మరోవైపు, రెండవ మరియు పదకొండవ ఇంటిని బుధ గ్రహం పరిపాలిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వాహనాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. రియల్ స్టేట్ చేసే వారికి ఈ సమయం బాగుంటుంది. 


ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశికి చెందిన వారు ప్రయాణాలు చేస్తారు. బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. 


మకరం (Capricorn)- ఈ రాశి యెుక్క నాలుగవ, పదకొండవ గృహాలకు అంగారకుడు మరియు ఆరు, తొమ్మిదవ గృహాలకు బుధుడు అధిపతి.  పరిశోధన పనిలో నిమగ్నమైన వ్యక్తులకు అంగారకుడి సంచారం లాభదాయకంగా ఉంటుంది. అదే సమయంలో బుధ సంచారానికి ముందు చేసిన కృషికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో అన్ని కోరికలు నెరవేరుతాయి. 


Also Read: Neechbhang Rajyog: సూర్యుడి 'నీచభంగ రాజయోగం'.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U   


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook