Planetary changes 2022: రానున్న 140 రోజులపాటు ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
Rashi Parivartan 2022: రాబోయే 140 రోజులు 4 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వీరి అదృష్టం ఒక్కసారిగా మారిపోనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Planetery changes 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల మార్పు మెుత్తం 12 రాశులపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఇది కొన్ని రాశులవారికి లాభాలను తెస్తే.. మరికొన్ని రాశులవారికి నష్టాన్ని ఇస్తుంది. రానున్న 140 రోజుల్లో కుజుడు, బుధుడు, గురు గ్రహాల రాశులలో మార్పు (Planetary changes 2022) రానుంది. దీని వల్ల 4 రాశులవారు అదృష్టం మారబోతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
తుల (Libra): ఈ రాశి వారికి రాబోయే 140 రోజులు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.
మీనం (Pisces): ఈ రాశి వారికి ఈ సమయం వరంలా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథునం (Gemini): ఈ రాశి వారు రాబోయే నాలుగున్నర నెలల్లో ఉద్యోగ-వ్యాపారాలలో చాలా పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం (Scorpio): ఈ రాశి వారికి సమాజంలో గౌరవాన్ని పొందుతారు. విద్యకు సంబంధించిన విషయాల్లో రాణిస్తారు. వీరు ఎక్కడ పనిచేసినా ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో రాణిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
Also Read: Lakshmidevi Blessings: లక్ష్మీదేవి కటాక్షం సదా ఉండాలంటే..ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook