March 2024 Grah Gochar: మార్చి నెలలో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
Grah Gochar in March 2024: మార్చి నెలలో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. సూర్యుడు, బుధుడు మరియు అంగారకుడు వంటి పెద్ద గ్రహాలు రాశులను మార్చబోతున్నాయి. దీంతో ఐదు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Planet Transit in March 2024: గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత ఉదయించడం లేదా అస్తమించడం, వాటి కదలికలను మార్చుకోవడం, ఇతర గ్రహాలతో కలిసి శుభ మరియు అశుభ యోగాలను సృష్టించడం చేస్తాయి. మార్చి నెలలో కూడా కొన్ని రాశుల గమనంలో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వచ్చే నెల ప్రారంభంలో అంటే మార్చి 4న కేతువు, మార్చి 7న బుధుడు, మార్చి 14న సూర్యుడు, మార్చి 25న అంగారకుడు తమ రాశులను మార్చనున్నారు. మార్చి 18న శనిదేవుడు ప్రస్తుతం ఉన్న కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ గ్రహాల మార్పులు కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉండనుంది.
కన్య: మార్చి నెలలో గ్రహాల సంచారం కారణంగా కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
వృశ్చికం: మార్చి నెలలో వృశ్చికరాశి వారు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండబోతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.
వృషభం: గ్రహాల గమనంలో మార్పు కారణంగా వృషభరాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. మీకు పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది.
కర్కాటకం: వచ్చే నెలలో గ్రహాల మార్పులు మీ ఫేట్ ను డిసైడ్ చేస్తాయి. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు తక్కువ టైంలో ధనవంతులు అవుతారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Chandra Grahan 2024: హోలీ పండుగ నాడే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులవారు జాగ్రత్త..
సింహం: మార్చిలో గ్రహాల సంచారం సింహరాశి వారికి భారీ లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పార్టనర్ షిప్ చేసే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లే అవకాశం ఉంది.
(Disclaimer:ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Astrology: త్వరలో గజలక్ష్మి యోగం.. ఈ 4 రాశులకు ఇక నుంచి అన్నీ మంచి రోజులే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter