మార్చ్ నెలలో జరిగే గ్రహాల పరివర్తనం ప్రభావంతో..ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రాశులవారి జీవితంలో పెను సమస్యలే ఎదురుకావచ్చు. మార్చ్ నెల ఎవరికి ఎలా ఉండనుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం రాశి పరివర్తనం చెందినప్పుడు దాని ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. మార్చ్ నెల జ్యోతిష్యం దృష్ట్యా చాలా కీలకమైంది. ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ నెలలో శుక్రుడు, సూర్యుడు, శని, బుధ గ్రహాలు రాశి మారనున్నాయి. ఈ గ్రహాల రాశి మారడం వల్ల కొన్ని రాశులకు లాభం కలిగితే..మరికొన్ని రాశులకు నష్టం వాటిల్లనుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం అందరిపై పడనుందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. 


శని ఉదయం 2023


మార్చ్ నెల ప్రారంభంలోనే శని గ్రహం కుంభరాశిలో ఉదయించనున్నాడు. మార్చ్ 6వ తేదీ ఉదయం 11 గంటల 36 నిమిషాలకు కుంభరాశిలో శని ఉదయించడం ఉంటుంది. సూర్య, బుధ గ్రహాలు కూడా కుంభ రాశిలో ఉంటాయి. శని ఉదయించడం వల్ల కొన్ని రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఇందులో వృషభం, సింహం, తుల, కుంభ రాశులవాళ్లున్నారు.


సూర్య గోచారం


సూర్యుడు మార్చ్ నెల మధ్యలో రాశి మారనున్నాడు. మార్చ్ 15వ తేదీ ఉదయం 6 గంటల 13 నిమిషాలకు సూర్యుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఉంటుంది. 


శుక్ర గోచారం


లగ్జరీ, సుఖ సంపదలకు కారకుడు శుక్రుడు. ఈ గ్రహం మీనరాశి నుంచి బయిటికొచ్చి మార్చ్ 12వ తేదీన మేషరాశిలో ప్రవేశించనున్నాడు. మేషరాశిలో శుక్రుడి ప్రవేశం ఉదయం 8 గంటల 13 నిమిషాలకుంటుంది. 


ఏ రాశిపై ఎలాంటి ప్రభావం


మేషరాశి


మార్చ్ నెలలో రాహువు దృష్టి మేషరాశిపై ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫలితంగా ఈ నెలంతా కలకలం ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి. పెళ్లైనవారి జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు. కష్టపడినా సరే తగిన ప్రతిఫలం ఉండదు. ఆదాయం తగ్గిపోతుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 


సింహరాశి


సింహరాశి జాతకులపై సూర్యుడి దృష్టి నెలకొంటుంది. ఫలితంగా మానసిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆర్ధికంగా లాభాలు తగ్గుతాయి. పెళ్లైనవారి జీవితంలో సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయి.


కన్యారాశి


గ్రహాల కదలికతో కన్యారాశి జాతకులకు తీవ్ర నష్టం కలగనుంది. ప్రధానంగా ఆర్ధిక సమస్యలు ఎదురుకావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఉరుకుపరుగులు తప్పవు. సిబ్బందితో వ్యవహారం చెడిపోతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు. ఈ రాశి జాతకులు ఈ నెలంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.


కుంభరాశి


కుంభరాశి జాతకులకు పనిచేసే చోట సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. వ్యాపారంలో కూడా మార్పు కన్పిస్తుంది. కుటుంబంతో సంబంధాలు చెడిపోవచ్చు.


Also read: Mercury transit 2023: ఇవాళ్టి నుంచి 15 రోజుల వరకూ 5 రాశుల జాతకులకు తిరుగుండదు, పదోన్నతి, ఊహించని డబ్బు మీ సొంతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook