Lakshmana Plant Benefits: ఇంట్లో మొక్కలు నాటడం ఎంతో మంచిది. ప్రతి చెట్టు మరియు మొక్కలో ఏదో ఒక దైవిక శక్తి ఉంటుందని నమ్మకం. అలాంటి ఓ లక్ష్మణ మొక్కను (Lakshmana Plant) ఇంట్లో నాటడం వల్ల..అది ఆ ఇంటికి సంపదను తెస్తుందని నమ్ముతారు. అయితే ఈ లక్ష్మణ మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మత విశ్వాసాల ప్రకారం, లక్ష్మణ మొక్క సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి (Goddess Lakshmi)సంబంధించినది. ఇది ఇంట్లో నాటడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా, ఈ మొక్క ఎక్కడ ఉంటే, అక్కడ నుండి ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. దీంతో పాటు ఈ మొక్క నాటిన ఇంట్లో అమ్మ లక్ష్మి నిత్యం నివసిస్తుంది.


లక్ష్మణ మొక్క గురించి ఆసక్తికర విషయాలు: 
ఇది తీగ జాతికి చెందిన మెుక్కగా భావిస్తారు. దీని ఆకులు తమలపాకులను పోలి ఉంటాయి. ఈ మొక్కను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. దీనిని లక్ష్మణ్ బూటీ అని పిలుస్తారు. ఈ మొక్కకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని చెబుతారు. ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.


లక్ష్మణ మొక్క ఎక్కడ నాటాలి?
లక్ష్మణ మొక్కను ఇంట్లో ఉత్తర దిశలో నాటండి. ఉత్తర దిశ సంపదకు కారకం మరియు సంపదకు దేవుడు అయిన కుబేరుడు కూడా ఈ దిశకు సంబంధించినవాడు. ఈ దిక్కున లక్ష్మణ మొక్కను నాటితే ఇంట్లో ధనం వస్తూనే ఉంటుంది. దీంతో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు.


Also read: Bedroom Vastu Tips: ఈ ఫోటోలను పడకగదిలో పెట్టకండి! పొరపాటున పెట్టారో మీ జీవితం అంతే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి