Pournami 2022: ఈ రోజే శరత్ పూర్ణిమ..లక్ష్మి దేవితో చంద్రున్ని పూజిస్తే..సకల శుభాలు కలుగుతాయి..
Pournami 2022: శరత్ పూర్ణిమ ఈ ఆదివారం మొదలు కాబోతోంది. అయితే ఈ రోజు అమ్మవారిని పూజించడంతోపాటు చంద్రుని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందని పూర్వీకులు చెబుతుండేవారు. శరత్ పూర్ణిమ ఎంతో ప్రత్యేకతను కలిగిందని శాస్త్ర గ్రంధాల్లో పేర్కొన్నారు.
Pournami 2022: అశ్విని మాసంలో వచ్చే పౌర్ణమిని శరత్ పౌర్ణమి అంటారు. ఈసారి శరత్ పూర్ణిమ అక్టోబర్ 9న రాబోతుంది. శరత్ పూర్ణిమ రోజున చంద్రుడు చాలా కాంతివంతంగా ఉంటాడని ఆ రోజున లక్ష్మీదేవితో పాటు చంద్రుని కూడా పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆరోజు చంద్రుడి నుంచి వచ్చే కాంతి సకల శుభాలను కలిగిస్తుందని హిందువుల నమ్మకం. ఆరోజు చంద్ర నుంచి వచ్చే కిరణాలను అమృత కిరణాలుగా పిలుస్తారు. అయితే లక్ష్మీదేవితో పాటు ఆ చంద్రుని పూజించి పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ముహూర్తాలు:
శరత్ పౌర్ణమి అక్టోబర్ 9న ఆదివారం రోజున తెల్లవారి జామున 3 గంటల 41 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అయితే పౌర్ణమి ప్రభావం సోమవారం కూడా పడింది. సోమవారం అక్టోబర్ 10 న మధ్యాహ్నం 2: 24 నిమిషాలకు ముగుస్తుంది. శరత్ ఏమన్నాడు సాయంత్రం 51 నిమిషాలకు చంద్రోదయం జరుగుతుంది.
లక్ష్మీదేవికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి:
శరత్ పూర్ణిమ రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఆరోజున అమ్మవారికి ఖీర్ ను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం పేర్కొంది. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో అష్టైశ్వర్యాలు, సిరిసంపదలకు లోటుండదని పురాణాల్లో పేర్కొన్నారు.
పురాణాల ప్రకారం శరత్ పూర్ణిమ రోజున ఆవుపాలతో ఖేర్ ను తయారు చేయాల్సి ఉంటుంది. ఆరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని.. పూజలో పాల్గొనేవారు తలస్నానం చేసి పసుపు వర్ణాలతో కూడిన దుస్తులను ధరించి అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇలా సమర్పించడం వల్ల సిరి సంపదలు లభిస్తాయి.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook