Radha Ashtami 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజున శ్రీకృష్ణుని (Lord Krishna)పుట్టినరోజు జరుపుకుంటారు. అనంతరం సరిగ్గా 15 రోజుల తర్వాత భాద్రపద శుక్ల అష్టమి నాడు రాధాష్టమి పండుగ జరుపుకుంటారు. ఈ రోజున రాధాజీ జన్మించారు. ఈసారి రాధాష్టమి సెప్టెంబర్ 4న వస్తోంది. ముఖ్యంగా ఈ పండుగను మధుర, బృందావనం, బర్సానా మొదలైన ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రాధాకృష్ణులను పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. రాధాష్టమి తిథి, పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ ముహూర్తం
భాద్రపద అష్టమి తిథి సెప్టెంబర్ 3, 2022 మధ్యాహ్నం 12:25 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 4, 2022 ఆదివారం ఉదయం 10:40 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, రాధాష్టమి పండుగ సెప్టెంబర్ 04 న జరుపుకుంటారు.


రాధాష్టమి పూజా విధానం 
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రాధాష్టమి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటి పూజా మందిరంలో రాధ దేవి విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్టించాలి. తర్వాత పూజ స్థలంలో నీటితో నింపిన కలశాన్ని పెట్టాలి. అనంతరం రాధ దేవికి పంచామృతంతో స్నానం చేయించాలి. పూజా సమయంలో రాధాకృష్ణులను ఆరాధించాలి. వీరికి పండ్లు, పూలు సమర్పించాలి. అనంతరం రాధ, కృష్ణ మంత్రాలు పఠించాలి. వీరి ఉపవాస కథను చదవి వినిపించాలి. చివరగా హారతి ఇచ్చి పూజను విరమించాలి. 


Also Read: Planet Changes 2022: సెప్టెంబరులో ఈ గ్రహాల స్థానం మార్పు... ఈ 5 రాశులవారి లైఫ్ కష్టాలమయం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook