Benefits of  Vipreet Rajyog: దుష్టుడైన రాహువు కదలికలు ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఏడాదిన్నరకొకసారి రాహు గ్రహం తన రాశిని మారుస్తుంది. కిందట ఏడాది రాహువు మీనరాశి ప్రవేశం చేశాడు. మార్చి 31న శుక్రుడు కూడా మీనరాశిలోకి వెళ్లాడు. ఈనెల 23 వరకు అదే రాశిలో ఉండబోతున్నాడు. మీనరాశిలో రాహువు, శుక్రుడు సంయోగం వల్ల విపరీత లేదా వ్యతిరేక రాజయోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రాబోయే పది రోజుల్లో ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీన రాశి: ఇదే రాశిలో విపరీత రాజయోగం ఏర్పడింది. దీంతో మీనరాశి వారు ఏం కోరుకున్న అది జరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతోంది. బిజినెస్ చేసే వ్యక్తులు మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. 
వృషభ రాశి: రాహువు-శుక్రుడు సృష్టించిన వ్యతిరేక రాజయోగం వృషభరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం వృద్ది చెందుతుంది. మీరు పెట్టే పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి బయటపడతారు. 


Also Read: Venus Transit 2024: శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి డబ్బు, కీర్తి పెరగబోతోంది..


మిథున రాశి: విపరీత రాజయోగం మిథునరాశి వారికి ఎన్నో లాభాలను ఇస్తుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. ఆగిపోయిన పదోన్నతి లభిస్తుంది. వ్యాపారస్తుల లాభాలు భారీగా పెరుగుతాయి. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు చేరుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  మిఛునరాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ప్రజల నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి