Rahu and Ketu Transit 2023: ఆస్ట్రాలజీలో రాహు-కేతువులను అశుభ లేదా దుష్ట గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల చెడు దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. రాహు, కేతువులు తమ రాశులను మార్చినప్పుడల్లా అవి ప్రజల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు మేషరాశిలో సంచరిస్తున్నాయి. అక్టోబరు 30 వరకు అదే రాశిలో ఉంటాయి. రాహు-కేతు సంచారం వల్ల మూడు రాశుల జీవితం గందరగోళానికి గురికానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం
రాహు-కేతువుల రాశి మార్పు మేషరాశి వారికి అస్సలు కలిసిరాదు. మీరు డబ్బు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. వ్యాపారులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 


Also read: Jupiter Mahadasha: మీ జాతకంలో గురు మహాదశ ఉందా? అయితే మీరు 19 ఏళ్లు కింగ్ లా బతుకుతారు..


వృషభం
రాహు-కేతువుల సంచారం వల్ల వృషభరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటారు. ఫ్యామిలీలో గొడవలు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. భార్యభర్తల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు బాగోదు.
కన్య
కేతు గ్రహం అక్టోబర్ 30న ఇదే రాశిలోకి ప్రవేశించనుంది. దీంతో ఉద్యోగ, వ్యాపారులు చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాలు చెడిపోతాయి. అప్పులు వాళ్లు ఇంటి మీద పడతారు. అనుకున్న పనులు సమయానికి జరగవు. 


Also read: Chaturgrahi Yog: మరో నాలుగు రోజుల్లో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రాశుల ఫేట్ మారడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook