Ketu Gochar 2023: త్వరలో రాహు-కేతు గోచారం.. ఈ రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..
Ketu Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలు అంటారు. ఈ గ్రహాల రాశిలో మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Ketu Gochar 2023 Effects: గ్రహాల కదలికలో మార్పులు మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. నెమ్మదిగా కదిలే గ్రహాలైన శని, రాహు మరియు కేతువు 2023 సంవత్సరంలో తమ రాశులను ఛేంజ్ చేస్తున్నాయి. ఏడాదిన్నరకు ఒకసారి రాహు-కేతువులు తమ రాశులను మారుస్తాయి. ఇవి ఎల్లప్పుడూ తిరోగమన దిశలో సంచరిస్తాయి. ఈ రెండు గ్రహాలు అక్టోబరు 30న తమ రాశులను మార్చనున్నాయి. రాహువు మేషరాశిలోనూ, కేతువు తులరాశిలోనూ ప్రవేశించనున్నారు. రాహు-కేతు సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
రాహు-కేతు సంచారం ఈ రాశులకు లాభం
వృషభం: వృషభ రాశి వారికి కేతువు సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరాశివారు శుభవార్త వింటారు. వీరికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు అపారమైన సంపదను పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహ రాశి : కేతువు యొక్క రాశి మార్పు వల్ల సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీకు పదవి, డబ్బుతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
ధనుస్సు: కేతు సంచారం ధనుస్సు రాశి వారి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం: కేతువు సంచారం మకర రాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. భారీగా ధనార్జన ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్-ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఆదాయంలో రెట్టింపు పెరుగదల ఉంటుంది.
Also Read: Surya Shani Yuti 2023: శివరాత్రికి ముందే ఆ రెండు గ్రహాల యుతి, 3 రాశులకు తిరగనున్న దశ, అంతా డబ్బే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook