Rahu Ketu Gochar 2023: రాహు-కేతు గ్రహాల గమనంలో మార్పు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..
Rahu Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, రాహువు మరియు కేతువుల రాశి మార్పు ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. రాహు-కేతువుల రాశి మార్పు వల్ల కొన్ని రాశులవారు లాభపడతారు.
Rahu Ketu Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రంలో రాహు, కేతులను ఛాయా గ్రహాలు అంటారు. రాహువు శనితో సమానమైన ఫలితాలను, కేతువు అంగారకుడితో సమానమైన ఫలితాలను ఇస్తాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, జాతకంలో బుధ గ్రహం మంచి స్థానంలో ఉంటే రాహు ప్రభావం తక్కువగా ఉంటుంది. మీ కుండలిలో గురు గ్రహం మంచి స్థానంలో ఉంటే కేతువు ప్రభావం పనిచేయదు.
ఆస్ట్రాలజీ ప్రకారం, రాహు-కేతువులు వారు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిని బట్టి ఫలితాలు ఇస్తారు. అందుకే రాహువు మరియు కేతువులను అంతుచిక్కని గ్రహాలు అంటారు. రాహువు మరియు కేతువులు ఒకటిన్నర సంవత్సరం ఒకే రాశిలో ఉండి వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తారు. అక్టోబరు 30, 2023న ఈ రెండు గ్రహాలు సంచరించబోతున్నాయి. రాహువు మీనరాశిలోకి, కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. వీటి సంచారం కారణంగా 3 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
వృషభం (Taurus): రాహువు సంచారం ఈ రాశికి శుభప్రదంగా ఉంటుంది. వృషభరాశి యెుక్క పదకొండవ దీని సంచారం జరగబోతుంది. దీంతో మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి రాబడిని పొందుతారు. మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
తుల (Libra): రాహువు ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో సంచరించనున్నాడు. ఈ రాశివారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు జాబ్ పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. రాహు సంచారం వల్ల వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మకరం (Capricorn): రాహువు ఈ రాశి యెుక్క మూడో ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీడియా, సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.