Rahu Ketu Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువుల్ని ప్రమాదకర, పాపాత్మక గ్రహాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ రెండు గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం చాలామంది జాతకాల్లో తీవ్ర మార్పులకు కారణమౌతుంది. అక్టోబర్ 30వ తేదీన రాహు, కేతువులు గోచారం ప్రభావం ముఖ్యంగా 3 రాశులపై స్పష్టంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమత విశ్వాసాల ప్రకారం నవగ్రహాలతో పాటు మరో రెండు ఛాయా గ్రహాలు రాహు, కేతువులున్నాయి. ఇవెప్పుడూ వక్రమార్గంలోనే పయనిస్తుంటాయి. ఒకటిన్నర సంవత్సరం అంటే 18 నెలలకోసారి రాశి పరివర్తనం చెందుతుంటాయి. ఈ ఏడాదిలో రాహు, కేతువుల గోచారముంది. అక్టోబర్ 30న రాహు కేతువులు రాశి మారనున్నాయి. రాహువు మేష రాశి నుంచి మీన రాశిలో ప్రవేశించనుండగా కేతువు తులా రాశి నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. అందుకే ఈ రెండు గ్రహాల గోచారం అంతులేని లాభాలు కురిపించనుంది. అంటే రాహు కేతువుల గోచారం ఎప్పుడూ ప్రతికూలంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో శుభసూచకం అవుతుంది. ముఖ్యంగా 3 రాశులకు రాహు కేతువులు గోచారం అదృష్టం పట్టించనుంది. ఈ మూడు రాశుల జాతకులు చేపట్టిన ప్రతి పని సఫమౌతుంది. ఆ ముూడు రాశుల గురించి తెలుసుకుందాం..


వృషభ రాశి జాతకులకు పూర్వీకుల తరపు నుంచి లాభాలుంటాయి. కెరీర్‌పరంగా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అంటే ఉద్యోగులకు మంచి జరుగుతుంది. ఎప్పటికప్పుుడు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంటుంది. ఫలితంగా ఆర్ధికంగా కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు విశేషమైన లాభాలుంటాయి. విదేశీ ప్రయాణం లాభించవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


కర్కాటక రాశి జాతకులకు రాహు, కేతువుల గోచారంతో అంతా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి కొత్త మార్గాలు కన్పిస్తాయి. ఊహించని ధనలాభం మీ ఆర్ధిక పరిస్థితిని మార్చేస్తుంది. అదే సమయంలో అదృష్టంగా తోడుగా ఉండటంతో చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో లేదా కెరీర్‌పరంగా గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చిక్కుకున్న డబ్పులు చేతికి అందడం విశేషం. 


మేష రాశి జాతకులకు  రాహు, కేతువుల రాశి పరివర్తనం ప్రభావం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఫలితంగా మేషరాశి జాతకులకు చాలా ఉపశమనం కలగనుంది. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారమయ్యే పరిస్థితులు ఉంటాయి. అందుకే ఆర్ధికంగా ఎలాంటి సమస్య  ఎదురుకాదు. 


Also read: Sun Transit 2023: సూర్య గ్రహ సంచారంతో ఈ రాశుల వారి జీవితాల్లో మళ్లీ సమస్యలు ప్రారంభం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook