Rahu-Ketu Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల నిర్ణీత సమయంలో నిర్దేశిత సమయంలో గోచారం చేస్తుంటాయి. అదే విధంగా అందరూ భయపడే రాహు కేతువులు కూడా కొత్త ఏడాది ప్రారంభంలోనే రాశి మారనున్నాయి. ఫలితంగా మూడు రాశులకు మహర్దశ పడుతుందంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యంలో రాహు కేతువులను పాప గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు జాతకంలో ఉంటే అంతా హాని కలుగుతుందంటారు. అందుకే రాహు కేతువుల ప్రభావమంటే భయపడుతుంటారు. అయితే రాహు కేతువుల ప్రభావం ఒక్కోసారి ప్రయోజనంగా కూడా ఉంటుంది. కొత్త ఏడాదిలో ఈ రెండు గ్రహాల గోచారం మూడు రాశులకు అదృష్టం వికసింపజేయనుంది. వాస్తవానికి రాహు కేతువులు కొత్త ఏడాదిలో రాశి మారడం లేదు. కానీ మూడు రాశులకు మాత్రం అద్భుత ప్రయోజనం చేకూర్చనున్నాయి. రాహువు మీన రాశిలో కేతువు కన్యా రాశిలో ఉన్నారు. అయితే ఇతర గ్రహాల గోచారం కారణంగా రాహు కేతువులు కొన్ని రాశులకు లాభం చేకూర్చనున్నాయి. 


కుంభ రాశి జాతకులకు రాహు కేతువుల ప్రభావంతో రానున్న కొత్త ఏడాది చాలా బాగుంటుంది. అన్నీ అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి లభిస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. చేపట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. 


రాహు కేతువుల ప్రభావంతో తుల రాశి జాతకులకు శుభయోగం కలగనుంది. విద్యార్ధులకు కెరీర్‌లో ఎదుగుదల కన్పిస్తుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లాభిస్తాయి. వ్యాపారం విస్తృతం కావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చేపట్టిన ప్రతి పని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది. 


వృషభ రాశి జాతకులపై రాహు కేతువుల ప్రభావం స్పష్టంగా ఉంది. ఈ రాశివారికి అన్ని రంగాల్లో ప్రయోజనం కలగనుంది. వ్యాపారులకు అత్యంత అనువైన సమయం. మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశముంది. కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. 


Also read: Rammandir Features: రామాలయం లోపల ఎలా ఉంటుంది, ఎంట్రీ, ఎగ్జిట్ ఎలా ఉంటాయి, ఏయే వసతులుంటాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook