Rahu Mahadasha Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తొమ్మిది గ్రహాల మహాదశ మరియు అంతర్దశ ప్రతి వ్యక్తిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మీ జాతకంలో ఏదైనా గ్రహం అనుకూల స్థితిలో ఉంటే మీరు శుభఫలితాలను, ప్రతికూల స్థితిలో ఉంటే అశుభ ప్రభావాలను ఇస్తుంది. ఆస్ట్రాలజీలో రాహు గ్రహాన్ని దుష్ట గ్రహం, ఛాయా గ్రహం అని పిలుస్తారు. రాహువు యెుక్క మహాదశ ప్రతి ఒక్కరిపై 18 సంవత్సరాలు ఉంటుంది. రాహు గ్రహాన్ని కఠినమైన మాటలు, జూదం, ప్రయాణం, దొంగతనం, చెడు పనులు, చర్మ వ్యాధులు, మతపరమైన ప్రయాణాలు మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. రాహువు మహాదశ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతకంలో రాహువు సానుకూలంగా ఉంటే..
మీ జాతకంలో రాహు గ్రహం సానుకూలంగా ఉంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. మీరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. పాలిటిక్స్ లో మంచి పదవి దక్కుతుంది.  మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. 
జాతకంలో రాహు గ్రహం ప్రతికూలంగా ఉంటే..
రాహు గ్రహం మీ జాతకంలో బలహీనంగా ఉంటే.. మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీరు మోసపోయే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. అనారోగ్యం బారిన పడతారు. శారీరక సమస్యలను ఎదుర్కోంటారు. వ్యసనాలకు బానిసలవుతారు. మీకు సమయం అస్సలు కలిసిరాదు. 
రాహు గ్రహ పరిహారాలు
1- రాహువు యొక్క అశుభ ప్రభావాలను నివారించడానికి బుధవారం నాడు బార్లీ, ఆవాలు, నాణెం, ఏడు రకాల ధాన్యాలు, నీలం లేదా గోధుమ రంగు వస్త్రాలు మరియు గాజు వస్తువులను దానం చేయండి.
2- ప్రతి రోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో మీ చేతులు మరియు కాళ్ళను కడగాలి. ఇలా చేయడం వల్ల రాహువు ప్రశాంతంగా ఉంటాడు.
3- రాహువు వల్ల కలిగే వ్యాధులు మరియు అడ్డంకులను నివారించడానికి రాహు యంత్రాన్ని పూజించండి. ఈ యంత్రాన్ని బుధవారం నాడు ప్రతిష్టంచండి.
4- బుధవారం నాడు నల్ల కుక్కకు తీపి రొట్టెలు తినిపించడం ద్వారా రాహు దోషం నుండి బయటపడవచ్చు.


Also Read: 12 ఏళ్ల తర్వాత మీనరాశిలో 3 రాజయోగాలు.. ఈ రాశులకు కొత్త జాబ్, ఉద్యోగంలో ప్రమోషన్ .. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook