Rahu Gochar 2023: అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశించనున్న రాహు గ్రహం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..
Rahu Gochar 2023: మరికొన్ని రోజుల్లో రాహు గ్రహం అశ్వినీ నక్షత్రంలో సంచరించబోతోంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బు మరియు పురోభివృద్ధి సాధిస్తారు.
Rahu Planet Nakshtra Parivartan: నిర్ణీత సమయం తర్వాత గ్రహాలు వాటి రాశులను మారుస్తాయి. ఫిబ్రవరి 09న ఛాయా గ్రహమైన రాహువు అశ్వినీ నక్షత్రంలోకి (Rahu Gochar in Ashwini Nakshatra 2023) ప్రవేశించనుంది. అశ్వినీ నక్షత్రాన్ని కేతు గ్రహం పరిపాలిస్తుంది. రాహు, కేతు మిత్రులు. దీంతో రాహు సంచారం మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మిథునం రాశిచక్రం
రాహువు యొక్క రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలోని ఆదాయ స్థలంలో రాహు కూర్చున్నాడు. దీంతో మీ సంపద రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మీకు వివిధ మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు మంచి పదవి పొందే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టేవారు లాభాలను గడిస్తారు.
కర్కాటక రాశిచక్రం
రాహువు యొక్క రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాహు గ్రహం మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఆస్తి లావాదేవీల నుండి ప్రయోజనం పొందుతారు.
కన్య రాశిచక్రం
రాహు సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే రాహు గ్రహం మీ ఆరవ ఇంట్లో కూర్చుంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో వ్యాపారుల ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Rajyog: శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు చెప్పలేనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook