COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rahu Transit On October: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ రాశి సంచారం చేస్తే దాదాపు అన్ని గ్రహాలపై ప్రభావం పడుతుంది. అయితే రాహువు అక్టోబర్‌ 30న మేష రాశిలోకి సంచారం చేసి..ఆ తర్వాత మీన రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా కొంతమంది జీవితంలో తీవ్ర ఇబ్బందులు వస్తే మరికొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాహువు సంచారం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారికి భవిష్యత్‌లో ఊహించని లాభాలు:
మేష రాశి:

రాహు సంచారం మేష రాశి వారికి గొప్ప వరంగా భావించవచ్చు. ఈ క్రమంలో వీరికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, వృత్తి పరంగా తిరుగులేని విజయాలు సాధిస్తారు. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. 


కర్కాటక రాశి:
రాహు సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి కూడా దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ సులభంగా తొలగిపోతాయి. ఈ రాశివారు రాహువు సంచారం కారణంగా కొత్త ఇల్లు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  


సింహ రాశి:
ఈ సమయంలో సింహ రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు కొత్త కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. దీని కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా మంచి లాభాలు కలుగుతాయి. ఈ సంచార క్రమంలో శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు.


మీన రాశి:
రాహువు సంచారం మీన రాశివారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గతంలో నిలిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. 


Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook