COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rahu Blessing Zodiac Till January 2025 Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. కానీ కొన్ని గ్రహాలు మాత్రం సంచారం చేయడానికి చాలా సమయం  పడుతుంది. అందులో రాహువు గ్రహం ఒకటి. ఈ గ్రహాన్ని కీడు గ్రహంగా పరిగణిస్తారు. రాహువు గ్రహం జూలై 8న ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రహం ఆగస్టు 16వ తేదిన ఇదే నక్షత్రంలో మూడవ స్థానంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా వృత్తిపర జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో.. అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 


మేషరాశి:
రాహువు నక్షత్రంలో మార్పులు చేయడం వల్ల మేష రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కష్టమైన పనుల్లో కూడా ఊహించని విజయాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కష్టమైన పనుల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా బాస్‌ నుంచి సపోర్ట్‌ లభిస్తుంది. అలాగే వీరు సులభంగా శత్రువులపై విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య వాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


మిథున రాశి:
రాహువు నక్షత్ర సంచారం కారణంగా మిథున రాశివారికి చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో వీరికి డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే వృత్తిపరమైన జీవితంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో పాటు వీరికి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన పురోగతి లభిస్తుంది. దీంతో పాటు ఈ మిథున రాశివారు అనేక శుభవార్తలు వినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో అన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మకర రాశి:
రాహువు సంచారం కారణంగా మకర రాశివారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. వీరు అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రాశివారు పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా కోర్టుకు సంబంధించిన కేసుల్లో కూడా విజయాలు సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరు భూవమితో పాటు భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా పోయిన డబ్బులు కూడా పూర్తిగా తిరిగి వస్తాయి. వీరు ఈ సమయాల్లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌లు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.