Rahu Transit In Uttara Bhadrapada Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహం తర్వాత అత్యంత నెమ్మదిగా రాశి సంచారం చేసే గ్రహాల్లో రాహువు ఒక్కటి.. ఈ గ్రహానికి ప్రత్యేమైన ప్రాముఖ్యత ఉంటుంది. రాహువు గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది. అయితే ఈ గ్రహం అప్పుడప్పుడు రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. దీని కారణంగా కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు సంచార దశలో ఉన్నాడు. అయితే ఈ గ్రహం శుభ నక్షత్రంలో సంచార దశలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రాహువు అనుగ్రహం లభించి ఊహించని ధనం కూడా పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహువు సంచారం సమయం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆగస్టు 16 ఉదయం 9.36 గంటలకు రాహువు గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేసింది. అయితే ఈ గ్రహం డిసెంబర్‌ రెండవ తేది వరకు అదే నక్షత్రంలో సంచార దశలో ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే 2025 సంవత్సరంలో 16 మార్చిన రాహువు గ్రహం 6.50 వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలో  సంచారం చేయనుంది. దీంతో కొన్ని రాశులవారికి అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 


కుంభరాశి:
రాహువు నక్షత్ర సంచారం కుంభ రాశివారికి చాలా అదృష్టకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి రాహువు శుభస్థానంలో ఉండడం వల్ల సుభంగా అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా నిలిపోయిన పనులు కూడా సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా భాహ్య జీవితంలో సుఖ, సంతోషాలు కూడా పెరుగుతాయి. కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా వీరికి అనేక లాభాలు కలుగుతాయి. 


మకరరాశి:
మకర రాశివారికి రాహువు సంచారం జాతకంలోని 3వ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా వీరికి నిలిచిపోయిన పనులన్ని సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. అంతేకాకుండా వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. 


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


తులారాశి:
తులారాశివారికి రాహువు సంచారం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి జీవితంలో ఆనందం రెట్టింపు అవ్వడమే కాకుండా శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే రుణమాఫీ కూడా జరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుంటుంబ సభ్యులతో సన్నిహితం కూడా పెరుగుతుంది. దీని కారణంగా వారి నుంచి డబ్బులు కూడా పొందుతారు. 


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.